Asianet News TeluguAsianet News Telugu

ఇంట్రస్టింగ్: 'ఇష్క్' నాట్ ఏ లవ్ స్టోరీ..! ట్రైలర్

 తేజ సజ్జ.. ఇప్పుడు ''ఇష్క్'' మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 'నాట్ ఏ లవ్ స్టోరీ' అనేది దీనికి ట్యాగ్ లైన్. అదే పేరుతో వచ్చిన మలయాళ చిత్రానికి ఇది అధికారిక తెలుగు రీమేక్. 

Ishq Release Trailer released jsp
Author
Hyderabad, First Published Jul 27, 2021, 1:42 PM IST

కోవిడ్ సెకండ్ వేవ్ కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుమొహం పడుతున్న నేపధ్యంలో  ధైర్యం చేసి థియేటర్లలోకి వస్తున్న మొదటి సినిమా 'ఇష్క్'. చాలా ఏళ్ళ తర్వాత మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆర్.బి. చౌదరి సమర్పిస్తున్న తెలుగు సినిమా ఇది. ఎన్వీ ప్రసాద్ - పారస్ జైన్ - వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ట్రైలర్ విడుదల చేసారు.

'ఇష్క్' ప్రేమ కథ కాదని మొదటి నుంచీ చెబుతూ వచ్చిన మేకర్స్.. కథ  ఇదని హింట్ ఇవ్వకుండా ట్రైలర్ ని ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు. అయితే ఇదొక సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి మహతి స్వరసాగర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరియు శ్యామ్ కె. నాయుడు కెమెరా వర్క్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రానికి వరప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేయగా.. విఠల్ కొసనం ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశారు. ఆ ట్రైలర్ మీరూ చూడండి.

 తేజ సజ్జా, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఇష్క్‌’. నాట్‌ ఎ లవ్‌స్టోరీ అనేది ట్యాగ్‌లైన్‌. ఎస్ ఎస్‌ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆర్‌.బి.చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఏప్రిల్‌ 23నే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా రిలీజ్‌కు బ్రేక్‌ పడింది.  తాజాగా థియేటర్లు తెరుచుకున్న కారణంగా ఈ నెల 30న థియేటర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర టీమ్ అనౌన్స్‌ చేసింది.


 తేజ సజ్జా మాట్లాడుతూ ‘‘ఇదొక కొత్త రకం కథ. ‘జాంబీరెడ్డి’ తర్వాత నేను చేసిన సినిమా ఇది. ఆద్యంతం ఉత్కంఠని రేకెత్తిస్తుంది. కొంత విరామం తర్వాత మెగా సూపర్‌ గుడ్‌ సంస్థ నాతో ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఇదే పేరుతో నితిన్‌ సినిమా చేశారు. మీ సినిమా పేరు వినియోగిస్తున్నాం అనగానే నితిన్‌ సరే అనడంతో ముందుకు వెళ్లాం’’అన్నారు.

 దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఛాయాగ్రాహకుడు సమీర్‌రెడ్డి వల్లే నాకు ఈ సినిమా చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాని 29 రోజుల్లో ఇంత నాణ్యంగా పూర్తి చేయడానికి కారణం నిర్మాతలు, ఛాయాగ్రాహకుడు శ్యామ్‌ కె.నాయుడు. తేజ, ప్రియా, తమిళ నటుడు రవీందర్‌తోపాటు చిత్రబృందం అంతా చక్కటి సహకారం అందించింది. మహతి మంచి సంగీతం అందించారు’’అన్నారు.

చెల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించిన తేజ సజ్జా జాంబిరెడ్డి సినిమాతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. జాంబిరెడ్డితో హిట్‌ ఇచ్చిన క్రియేటివ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మతోనే మరో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి హనుమాన్‌ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఇక ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.  
 

Follow Us:
Download App:
  • android
  • ios