విశ్వక్‌సేన్ ట్వీట్ ...‘బేబి’డైరక్టర్ కు కౌంటరా?,ఇంకో వివాదం?
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన ఈ మూవీ జూలై 14న రిలీజ్ అయి మొదటి రోజు నుంచి రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది.

విశ్వక్‌సేన్ అంటే వివాదం అన్నట్లుగా ఆయన స్టేట్మెంట్స్ ఉంటున్నాయి ఈ మధ్యన. రీసెంట్ గా విశ్వక్‌సేన్ నుండి వచ్చిన సినిమా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సమయంలో జరిగిన రచ్చ చూసినప్పుడు జనం ఈ మాటకు ఫిక్సైపోయారు. అయితే కావాలనే ఈ వివాదం చేసేడనే విమర్శ ఉంది. అసలు ఆ సినిమా జనాల్లోకి అంతగా వెళ్లడానికి కూడా ఆ వివాదమే కారణం అనేది నిజం. ‘ఓరి దేవుడా’ సినిమా ఎలాంటి వివాదం లేకుండా వచ్చేసింది. వర్కవుట్ కాలేదు. సర్లే ఇప్పుడు ఈ వివాదం ప్రసక్తి ఎందుకు అంటే... తాజాగా ఆయన ట్వీట్ గురించే... “no” అంటే అర్దం “no” అనే. ఇది మగాళ్లకు కూడా వర్తిస్తుంది. అంటూ ట్వీట్ చేసారు. అయితే ఈ ట్వీట్ ఏ విషయం గురించి, ఎవరిని టార్గెట్ చేస్తూ అనేది ఎవరికీ అర్దం కాలేదు.
అయితే ఓ సెక్షనాఫ్ మీడియా మాత్రం ఈ ట్వీట్ బేబి దర్శకుడు సాయి రాజేష్ ని ఉద్దేశించి అంటోంది. అందుకు కారణం ..బేబి చిత్రం ప్రమోషన్ లో భాగంగా తన కథను ఓ హీరోకు చెప్తే వినటానికి కూడా ఇష్టపడలేదని చెప్పారు. ఆ హీరో ఎవరనేది చెప్పలేదు. ఆ హీరో విశ్వక్సేన్ ...అందుకే ఇలా స్పందించారని అంటున్నారు. అయితే సాయి రాజేష్ కథ చెప్తానంటే రిజెక్ట్ చేసింది విశ్వక్సేనేనా లేక మరొకరా అనేది ప్రక్కన పెడితే ఇప్పుడీ ట్వీట్ వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆ ట్వీట్ లో ఉన్నది ఇదే..."వద్దు అంటే వద్దు" అనేది మగవాళ్ళకి కూడా వర్తిస్తుంది కాబట్టి కూల్‌గా ఉంచుకుందాం, అరవడం మానుకుందాం. మనమందరం ఇక్కడ శాంతియుత వాతావరణంలో ఉన్నాము, కాబట్టి మనం విశ్రాంతి తీసుకోండి
గతంలో ఓ ఇంటర్వూలో ... వివాదాల వల్ల వచ్చిన మేలంటూ ఏమీ లేదు అన్న విశ్వక్‌సేన్.. ఒకవేళ వివాదం చోటు చేసుకున్నాక దాని గురించి భయపడి ఇంట్లో కూర్చున్నానంటే నన్నే సర్దేస్తారు అని తన శైలి చెప్పుకొచ్చాడు. వివాదం వచ్చినప్పుడు బలంగా ఎదుర్కొని, పోరాడి నా తప్పేమీ లేదని నిరూపించుకుంటాను. అంతేతప్ప ఊరుకోను అని చెప్పారు.
‘ఫలక్‌నుమా దాస్’, ‘హిట్’, ‘ఓరి దేవుడా’, ‘దాస్ కా ధమ్కీ’ లాంటి వైవిధ్యమైన చిత్రాలతో కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు విలక్షణమైన సినిమాలు చేస్తూ హీరోగా తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు విశ్వక్ సేన్. దర్శకుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఒకటి షూటింగ్ పూర్తి చేసుకోగా, మిగతా రెండు సెట్స్ పై ఉన్నాయి.