Asianet News TeluguAsianet News Telugu

పవన్ కోసం ఎన్టీఆర్ ని నిర్లక్ష్యం చేస్తున్న త్రివిక్రమ్?

పవన్ హీరోగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న అయ్యప్పనుమ్ కోశియుమ్ మూవీ తెలుగు రీమేక్ కి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్  అందించే బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అయితే పవన్ మూవీ కోసం ఎన్టీఆర్ చిత్రాన్ని త్రివిక్రమ్ నిర్లక్ష్యం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది . మిత్రుడు పవన్ నటిస్తున్న మూవీ కోసం ఎక్కువ సమయం కేటాయించడమే కాకుండా, ఆసక్తి చూపిస్తున్న త్రివిక్రమ్... ఎన్టీఆర్ మూవీ నిర్లక్ష్యం చేస్తున్నాడన్న వార్త వినిపిస్తుంది.

is trivikram neglecting ntrs project for pawan kalan movie ksr
Author
Hyderabad, First Published Jan 26, 2021, 3:13 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో మూవీతో భారీ హిట్ కొట్టారు. బన్నీ కెరీర్ బెస్ట్ గా నిలిచిన ఆ మూవీతో ఆయన తిరిగి ఫార్మ్ లోకి వచ్చారు. అజ్ఞాతవాసి మూవీ త్రివిక్రమ్ ఇమేజ్ ని భారీగా డామేజ్ చేసింది. కాపీ వివాదాలతో పాటు సినిమా ఘోర పరాజయం అందుకోవడం ఆయనను బాగా ఇబ్బంది పెట్టింది. ఆ తరువాత ఆయన ఎన్టీఆర్ తో చేసిన అరవింద సమేత వీరరాఘవ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ భారీ వసూళ్లు రాబట్టలేకపోయింది. 


అల వైకుంఠపురంలో మూవీ ఇండస్ట్రీ హిట్ అందుకోగా త్రివిక్రమ్ కి స్టార్ హీరోల ఆఫర్స్ దక్కుతున్నాయి.  తమిళ, కన్నడ పరిశ్రమలకు చెందిన క్రేజీ డైరెక్టర్స్ ని కాదని ఎన్టీఆర్ తన 30వ చిత్రం త్రివిక్రమ్ తో కమిట్ అయ్యారు. కాగా 2020లో ఏప్రిల్ లోనే ఈ మూవీ షూటింగ్ మొదలుకావాల్సి ఉంది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ అనుకున్న సమయానికి మొదలు కాలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు.  కాగా ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ తన మిత్రుడు పవన్ కళ్యాణ్ మూవీకి కమిట్ అయ్యారు. 


పవన్ హీరోగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న అయ్యప్పనుమ్ కోశియుమ్ మూవీ తెలుగు రీమేక్ కి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్  అందించే బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అయితే పవన్ మూవీ కోసం ఎన్టీఆర్ చిత్రాన్ని త్రివిక్రమ్ నిర్లక్ష్యం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది . మిత్రుడు పవన్ నటిస్తున్న మూవీ కోసం ఎక్కువ సమయం కేటాయించడమే కాకుండా, ఆసక్తి చూపిస్తున్న త్రివిక్రమ్... ఎన్టీఆర్ మూవీ నిర్లక్ష్యం చేస్తున్నాడన్న వార్త వినిపిస్తుంది. ఎన్టీఆర్ తో మూవీ త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచన కూడా ఆయన చేయడం లేదట. ఇది ఒకింత ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఆగ్రహానికి గురిచేసే అంశమే అనాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios