సమంత, నాగ చైతన్యల విడాకులకు కారణాలు ఇంతవరకు తెలియదు. అయితే ఆమె ఓపెన్ అయ్యారని, నాగ చైతన్య వేధింపుల సమంత ఆయనతో విడిపోయారంటూ ఓ ట్వీట్ వైరల్ అవుతుంది.  

హీరో నాగ చైతన్య, స్టార్ లేడీ సమంత నాలుగేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికారు. 2018 లో వివాహం చేసుకున్న ఈ టాలీవుడ్ కపుల్ 2021లో విడాకుల ప్రకటన చేశారు. వివాహం అనంతరం కూడా సమంతకు నాగ చైతన్య పూర్తి స్వేఛ్చ ఇచ్చారు. ఆమె కెరీర్ ని కొనసాగించేలా వెసులుబాటు కల్పించారు. అదే సమయంలో సమంత అక్కినేని వారి కోడలిగా హుందాగా వ్యవహరించారు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ప్రేమాభిమానాలు చూరగొన్నారు. 

నాలుగేళ్ల కాపురంలో నాగ చైతన్య-సమంత మధ్య గొడవలు జరిగాయన్న ఆధారాలు లేవు. హ్యాపీగా సాగిపోతున్న వారి కాపురంలో అనుకోని కలతలు చోటు చేసుకున్నాయి. విడాకులు తీసుకునే వరకు వ్యవహారం వెళ్ళింది. సమంత, నాగచైతన్య ఎందుకు విడిపోయారనే విషయంపై అనేక వాదనలు ఉన్నాయి. అటు సమంతను ఇటు నాగ చైతన్యను ద్వేషిస్తూ పలు ఆరోపణలు తెరపైకి వచ్చాయి. నిజం ఏమిటనేది వారికి మాత్రమే తెలిసిన రహస్యం. 

తాజాగా వీరి సెపరేషన్ కారణాలు ఇవే అంటూ, సమంత స్వయంగా చెప్పారంటూ ఓ ట్వీట్ తెరపైకి వచ్చింది. ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు సంచలన కామెంట్ పోస్ట్ చేశారు. నాగ చైతన్య ఒక బ్యాడ్ హస్బెండ్. మానసికంగా, శారీరకంగా నన్ను ఇబ్బంది పెట్టాడు. నేను గర్భం దాల్చితే అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది. అతని వేధింపులు తట్టుకోలేకే, విడిపోయానని సమంత చెప్పినట్లు ఉమర్ సంధు ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ సంచలనం రేపుతోంది. 

Scroll to load tweet…
Scroll to load tweet…

ఉమర్ సంధు సంచలన ట్వీట్స్ కి ఫేమస్. ఫోకస్ కావడం కోసం ఇలాంటి పనులు చేస్తాడనే వాదన ఉంది. గతంలో ఆయన సల్మాన్, పూజా హెగ్డే ఎఫైర్ లో ఉన్నారని. ప్రభాస్-కృతి సనన్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ట్వీట్ చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ... ఆయన పెద్ద ఉమనైజర్. అనేక మంది హీరోయిన్స్ తో బెడ్ షేరు చేసుకున్నాడంటూ ట్వీట్ చేశాడు. కాబట్టి ఆయన ట్వీట్ ని అంత సీరియస్ గా తెలుకోవాల్సిన అవసరం లేదంటున్నారు కొందరు.