మహేష్, రంగస్థలంతో హిట్ అందుకున్న దర్శకుడు సుకుమార్ తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ వేసవి నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు సుకుమార్  గత కొద్ది రోజులుగా ఈ చిత్రానికి సంభందించిన కథ, కథనాలను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాడు.  అందుతున్న సమాచారం ప్రకారం...ఈ సారి ఓ కొత్త బ్యాక్ డ్రాప్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది.  అది మరేదో కాదు...ఎర్ర చందనం స్మగ్లింగ్. 

మన రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో ఉన్న  అడవుల్లో  అరుదైన ఎర్రచందనం స్మగ్లర్ల పాలవుతోంది. ఈ అక్రమ రవాణా ముప్పై  ఏళ్లకు పైగా జరుగుతూనే వుంది.  గిరిజన తెగలకు చెందిన వేల కుటుంబాలు ఈ చెట్లను నరుకుతున్నట్లు పోలీస్ లు చెప్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు ఎం తోమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్నారు. స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్తమార్గాలను అన్వేషిస్తూ.. ముందుకెళ్తున్నారు. 

ఈ విషయాలన్ని క్రోడీకరిస్తూ ఇంట్రస్టింగ్ గా సుకుమార్ స్క్రిప్టు రెడీ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాలో మహేష్ పోలీస్ అధికారిగా కనిపిస్తారా లేక స్మగ్లర్స్ ని ఎదిరించే లోకల్ వ్యక్తిగా కనిపిస్తారా అని తెలియాల్సి ఉంది.  రంగస్దలం షూటింగ్ టైమ్ లో ఈ థీమ్ గురించి ఆలోచన వచ్చి డవలప్ చేసినట్లు సమాచారం. మహేష్ సైతం ఈ సబ్జెక్టుని చాలా ఇష్టపడ్డారని అంటున్నారు.

ఒకవైపు స్క్రిప్ట్ వర్క్ రెడీ చేసుకుంటూనే.. మరోవైపు సాంకేతిక వర్గాన్ని, నటీనటులను ఎంపిక చేసుకునే పనిలో మునిగిపోయాడు.  సుకుమార్ ఎప్పటిలాగే తన సినిమాకు దేవిశ్రీని సంగీత దర్శకుడిగా ఇప్పటికే ఎంపిక చేసుకున్నారట.  శ్రీమంతుడు, రంగస్థలం వంటి భారీ హిట్స్ ను నిర్మించిన మైత్రి మూవీమేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

2014లో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం `వ‌న్‌-నేనొక్క‌డినే`.భారీ అంచ‌నాల మ‌ధ్య  విడుద‌లైన ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా  నిలిచింది.  ఆ తర్వాత ఎవరికి వాళ్లు హిట్స్ కొట్టారు. ముఖ్యంగా రంగస్దలం సూపర్ హిట్ తో సుకుమార్ మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. దాంతో త్వ‌ర‌లో మ‌రోసారి వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమాకు రంగం సిద్దమైంది. మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మించ‌బోతోంది. 

సుకుమార్ రీసెంట్ గా ..థాయిలాండ్ వెళ్లి స్కోరీ డిస్కషన్స్ జరిపి హైదరాబాద్  వచ్చారు. మహేష్ కు నేరేట్ చేసారు. కథ నచ్చిన మహేష్ వెంటనే ప్రాజెక్టు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే మార్చి నుంచి ఈ సినిమా పట్టాలు ఎక్కనుంది. 2109 డిసెంబ‌ర్‌లో లేదా 2020 ప్రారంభంలో సినిమా విడుద‌ల చేయాల‌నుకుంటున్నాడ‌ట‌.