Asianet News TeluguAsianet News Telugu

విజయ్‌ ఆంటోని కూతురు మీరా మరణానికి కారణం అదేనా? .. సూసైడ్‌ నోట్‌లో ఏముంది?

హీరో విజయ్‌ ఆంటోని కూతురు మీరా ఆత్మహత్య అందరికి కలచివేస్తుంది. అయితే ఆమె ఆత్మహత్యకి కారణమేంటనేది అనుమానంగా మారింది. తాజాగా ఓ విషయం బయటకు వచ్చింది. సూసైడ్‌ నోట్‌లో ఏముంది?

is this reason vijay antony daughter meera suicide what she write in suicide note? arj
Author
First Published Sep 21, 2023, 7:49 PM IST

హీరో విజయ్ ఆంటోని కూతురు మీరా రెండో రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అది చిత్ర పరిశ్రమని షాక్‌కి గురి చేస్తుంది. కేవలం చిత్ర పరిశ్రమనే కాదు, సాధారణ జనాలు సైతం దిగ్బ్రాంతికి గురయ్యారు. ఇక విజయ్‌ ఆంటోని ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. వారి లైఫ్‌లో చోటు చేసుకున్న అతిపెద్ద విషాదం నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నారు. అయితే ఇంటర్మియట్‌ చేస్తున్న మీరా ఆత్మహత్య చేసుకోవడమే అనేక అనుమానాలకు తావిస్తుంది. 

ఆమె చాలా కాలంగా మానసికమైన ఒత్తిడికి గురవుతుందని, ట్రీట్‌మెంట్‌ కూడా తీసుకుంటుందని తెలుస్తుంది. స్టడీస్‌కి సంబంధించి మీరా చాలా ఒత్తిడికి గురవుతుందని, డిప్రెషన్‌లోకి వెళ్తుందని, దీనికి సంబంధించిన ట్రీట్‌ మెంట్‌ తీసుకుంటుందని తెలుస్తుంది. అయితే దాని కారణంగానే ఆత్మహత్యకి పాల్పడిందా? లేక మరేదైనా కారణమా? అనేది అందరిని తొలుస్తున్న ప్రశ్న. ఈ నేపథ్యంలో మీరాకి సంబంధించిన ఓ ఆశ్చర్యకరమైన వార్త బయటకు వచ్చింది. 

మీరాకి చీకటి అంటే భయమట. చీకటిని చూస్తే ఆమె తట్టుకోలేదని, చాలా భయపడుతుందని నటి సుధ తెలిపారు. మీరా మృతికి సంబంధించిన షాకింగ్‌ విషయాలను వెల్లడించింది. మీరాకి చీకటి అంటే భయమని వాళ్ల నానమ్మ(విజయ్‌ ఆంటోని అమ్మ) చెప్పిందట. ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లలన్నా, చీకట్లో కాసేపు ఉండాలన్నీ భయపడిపోతుందని, అలాంటి అమ్మాయి ఇంతటి కఠిన నిర్ణయం తీసుకునేందుకు ఎలా ధైర్యం చేసిందో అర్థం కావడం లేదని నటి సుధ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. పిల్లలను ఎంతో ప్రేమించే విజయ్‌ ఆంటోని కి ఇలా జరగడం దురదృష్టకరమని తెలిపింది. 

భయాలు చాలా రకాలు ఉంటాయని, ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుందని, కొందరు ఒంటరిగా ఉండాలంటే భయపడతారని, మరికొందరికి నీళ్లు అంటే భయమని, ఇంకొందరికి ఎత్తైన ప్రదేశాలంటే భయమని, మెట్టు ఎక్కినా, సముద్రాన్ని చూసినా, స్నానం చేసినా భయపడుతుంటారని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనికి పరిష్కారం.. భయం ఉన్న దానికి సంబంధించి పదే పదే అదే పని చేయాలని, దీంతో భయం పోతుందని, నెమ్మదిగా అలవాటుగా మారుతుందంటున్నారు. 

ఇదిలా ఉంటే మీరా ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో ఆమె సూసైడ్‌ నోట్ లభించిందని సమాచారం. తన నోట్‌ బుక్‌లో పోలీసులు ఈ సూసైడ్‌ నోట్‌ని గుర్తించారట. ఇందులో ఆమె తన స్నేహితులకు, టీచర్స్ ని మిస్‌ అవుతున్నట్టు రాసిందట. తన మరణం వల్ల ఫ్యామిలీ బాధపడుతుందని పేర్కొందని, చివర్లో లవ్‌ యూ ఆల్‌, మిస్‌ యూ ఆల్‌ అని రాసిందని సమాచారం. అయితే ఇందులో ఇంకా ఏం రాసిందనేది తెలియాల్సి ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios