Asianet News TeluguAsianet News Telugu

#Vijay విజయ్ ఆఖరి సినిమా బాలయ్య రీమేకా?

తనకు 69వ మూవీనే చివరిదని విజయ్ చెప్పేశారు. ఈ సినిమాపై ప్రకటన మార్చి లేకపోతే ఏప్రిల్‍లో వస్తుందని సమాచారం.

Is Tamil hero Vijay wishes to remake #BhagavanthKesari? jsp
Author
First Published Feb 3, 2024, 8:23 AM IST

రాజకీయాల్లో పూర్తిస్థాయిలో ఉండాలనుకుంటున్నా. నేను ఇంతకు ముందే అంగీకరించిన మరో సినిమాను పూర్తి చేస్తా. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటా. పార్టీ పనులు, ప్రజల సేవ కోసం కట్టుబడతా. తమిళనాడు ప్రజలకు ఇది నేను కృతజ్ఞతగా భావిస్తున్నా.. అని దళపతి విజయ్ చేసిన ప్రకటన ఇప్పుడు తమిళ సినిమా, రాజకీయాల్లో సెన్సేషన్ గా మారింది. అదే సమయంలో ఆయన తో వరస సినిమాలు చేసే దర్శక,నిర్మాతలకు కంగారు పెట్టింది. అయితే ఆ ఆఖరి సినిమా ఎవరికి చేయబోతున్నారు అంటే తెలుగు నిర్మాత డివివి దానయ్యకు అంటున్నారు. 

ప్రస్తుతం చేస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్‍టైమ్ తర్వాత దళపతి విజయ్.. డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై మూవీ చేయనున్నారని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ మూవీని ప్రొడ్యూజ్ చేసిన డీవీవీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని టాక్. అలాగే, సన్ పిక్చర్స్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగమవుతుందనే వార్తలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాని ఎవరు డైరక్ట్ చేయబోతున్నారు అంటే కార్తీక్ సుబ్బరాజ్ డైరక్ట్ చేయవచ్చు అంటున్నారు. అలాగే హెచ్. వినోద్ సైతం రేస్ లో ఉన్నారు. ఇప్పటిదాకా ఎవరూ ఫైనల్ కాలేదు. కానీ విజయ్ దృష్టి మాత్రం  “భగవంత్ కేసరి” మూవీ రీమేక్ పై ఉందని వార్తలు వస్తున్నాయి. వంశీ పైడిపల్లి సైతం ఈ రేసులో ఉన్నట్లు చెప్తున్నారు.

లాస్ట్ ఇయిర్ దసరా కానుకగా విడుదల బాలయ్య కెరీర్ లోనే ప్రత్యేకమైన మూవీగా నిలిచింది “భగవంత్ కేసరి” మూవీ . అక్టోబర్ 19న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ కేవలం వారం రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్య సత్తా ఏమిటో మరోసారి నిరూపించింది.   శ్రీలీల ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడం కూడా కలిసి వచ్చింది. ఇక ఈ మూవీలో నేలకొండ భగవంత్ కేసరి పాత్రలు బాలయ్య చెప్పిన డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్, బాలయ్య అభిమానులు కోరుకునే పలు మాస్ అంశాలతో పాటు సమాజానికి ఉపయోగపడే సందేశాన్ని దర్శకుడు ఇచ్చిన విధానం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

 ఈ చిత్రం  థియేటర్లోనే కాకుండా ఆ తర్వాత అమెజాన్ లో విడుదలయ్యాక కూడా  మంచి రెస్పాన్స్ వచ్చింది. “భగవంత్ కేసరి”మూవీ తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ని అట్రాక్ట్ చేసింది. దానికి కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపితే మరింత గొప్పగా ఉంటుందని భావిస్తున్నారట. కాకపోతే రీమేక్ రైట్సే దానయ్య దగ్గర లేవు. వేరే నిర్మాత దగ్గర తీసుకుని చేయాలి. అంటే పార్టనర్ గా చేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ లిటిగేషన్స్ అన్ని ఉండటంతో  ఏ మేరకు మెటీరియలైజ్ అవతుందో చూడాలి.తనకు 69వ మూవీనే చివరిదని విజయ్ చెప్పేశారు. ఈ సినిమాపై ప్రకటన మార్చి లేకపోతే ఏప్రిల్‍లో వస్తుందని సమాచారం.
 

Follow Us:
Download App:
  • android
  • ios