ఒకప్పుడు వరస హిట్స్ తో తెలుగు తెరను ఏలిన పూరి జగన్నాథ్ ..గత కొంతకాలంగా హిట్ అనేది మర్చిపోయారు. దాంతో ఆయనతో పనిచేయటానికి పెద్ద హీరోలు ఎవరూ ఆసక్తి చూపటం లేదు. ఆయన తయారు చేసే కథల్లో గ్రిప్ ఉండటం లేదని, గతంలోలాగ ఇంట్రస్టింగ్ డైలాగులు రాయలేకపోతున్నారని కామెంట్స్ వచ్చాయి. అందుకు తగ్గట్లే వచ్చిన ఫ్లాఫ్ అవి నిజమే అని ప్రూవ్ చేసాయి. ఈ నేపధ్యంలో రామ్ తో చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా రిలీజైంది. సినిమా మాస్ బాగానే పట్టిందని రెండో రోజు సైతం వచ్చిన కలెక్షన్స్ తో అర్దమవుతోంది. అయితే ఇప్పుడు ఆయనకు స్టార్ హీరోలు డేట్స్ ఇస్తారా అనేది క్వచ్చిన్ మార్క్ గా మారింది.

ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకునేదాన్ని బట్టి..స్టార్ హీరోలు ఆయనకు డేట్స్ ఇచ్చేలా ఉంటే ఈ పాటికి ఆయనకు కంగ్రాట్స్ చెప్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేసేవారు. అంటే వాళ్లకు ఇస్మార్ట్ శంకర్ హిట్ ...సరిపోవటం లేదన్నమాట. దానికి తోడు ఇస్మార్ట్ శంకర్ క్రెడిట్ మొత్తం రామ్ కే వెళ్లిపోయింది. సెకండాఫ్ సోసోగా ఉండటం, మార్కెట్లో సరైన మాస్ సినిమా వచ్చి చాలా కాలం అవటం కూడా ఈ సినిమా కు బాగా ప్లస్ అయ్యింది. కాబట్టి ఇస్మార్ట్ శంకర్ సినిమాని స్టార్స్ పెద్ద హిట్ గా పరిగణించటం లేదు. దాంతో ఎవరూ పూరితో చేయటానికి ఆసక్తి చూపటం లేదని సమాచారం.

 దాంతో పూరి జగన్నాథ్ నెక్ట్స్ ఎవరితో చేయబోతున్నారనేది క్వచ్చిన్ మార్క్ గా మారింది. మరో ప్రక్క మహేష్ తో సినిమా చేసేది లేదని పూరి తేల్చి చెప్పేసారు. హిట్లు ఇస్తున్న డైర‌క్ట‌ర్స్‌తోనే మ‌హేష్‌బాబు వ‌ర్క్ చేస్తాడ‌ని పూరి జ‌గ‌న్నాథ్ చేసిన కామెంట్ ఇప్పటికే క‌ల‌క‌లం రేపింది.  బాలయ్య విషయంలో మాత్రం పూరి జగన్నాథ్ బాగా పాజిటివ్ గా మాట్లాడారు. ఆయన తో ఏమన్నా సినిమా చేసే అవకాసం ఉందేమో మరి..చూడాలంటున్నారు.