టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి మొదటి నుండి సరికొత్త కథలను ఎన్నుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది. ఈ తమిళ ముద్దుగుమ్మకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఆమె తమిళంలో ధనుష్ తో కలిసి 'మారి2' సినిమాలో నటిస్తోంది.

అలానే తెలుగులో ఆమె నటించిన 'పడి పడి లేచే మనసు' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తరువాత మరో ఆసక్తికర ప్రాజెక్ట్ లో కనిపించనుంది ఈ బ్యూటీ. 'నీది నాది ఒకే కథ' ఫేమ్ దర్శకుడు వేణు ఊడుగుల.. సాయి పల్లవి హీరోయిన్ గా ఓ సినిమా రూపొందించనున్నాడు.

ఈ సినిమాకి 'విరాట పర్వం 1992' అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. హీరోగా రానా దగ్గుబాటిని అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ నక్సలైట్ పాత్రలో కనిపించనుందని సమాచారం.

ఆమె పాత్ర డిఫరెంట్ గా ఉంటుందని ఆ కారణంతోనే సాయి పల్లవి సినిమా అంగీకరించిందని అంటున్నారు. హీరో పోలీస్ క్యారెక్టర్ లో కనిపించగా.. ఓ నక్సలైట్, పోలీస్ ల మధ్య నడిచే ప్రేమకథతో సినిమాను రూపొందిస్తారట. ఇదే గనుక నిజమైతే.. సిల్వర్ స్క్రీన్ మీద ఈ జంట మ్యాజిక్ చేయడం ఖాయం!