దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి బాహుబలి సినిమా తరువాత తెరకెక్కిస్తోన్న చిత్రం 'RRR'. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు. అయితే నిన్న సాయంత్రం చిత్రబృందం నుండి ఒక ప్రకటన వచ్చింది.

అదేంటంటే.. జిమ్ లో కసరత్తులు చేస్తుండగా.. రామ్ చరణ్ గాయపడ్డాడని, అతడి కాలి మడమకి దెబ్బ తగిలిందని.. దాదాపు మూడు వారాల పాటు పూణేలో జరగాల్సిన సినిమా షూటింగ్ వాయిదా పడుతుందని చెప్పారు. ఇది ఇలా ఉంటే మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ మొన్నటికి మొన్న 'RRR' లాంగ్ షెడ్యూల్ కోసం వడోదర వెళ్తున్నట్లు విమాన టికెట్లు కూడా షేర్ చేశాడు.

ఇప్పుడేమో సినిమా యూనిట్ పూణే షెడ్యూల్ క్యాన్సిల్ చేసినట్లు చెబుతున్నారు. కానీ ఎన్టీఆర్ షేర్ చేసిన ఫ్లైట్ టికెట్స్ లో రామ్ చరణ్ టికెట్ కూడా ఉంది. అది స్పష్టంగా తెలుస్తోంది. దీంతో సందేహాలు తలెత్తుతున్నాయి. చిత్రబృందం అబద్ధం చెబుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాకి హైప్ తీసుకురావడం కోసం ఇలా చేస్తున్నారా..? అంటే ఉండాల్సిన హైప్ ఎలానూ ఉంది.

కానీ ఇలాంటి ట్వీట్ లు పెట్టి ప్రజల దృష్టిని ఆకర్షించాల్సిన అవసరం ఏముందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ట్వీట్ లో పొరపాటు దొర్లిందా..? లేక చరణ్ ని జనసేన కోసం ప్రచారం ఎందుకు చేయలేదని అభిమానులు అడిగితే సాకు చెప్పి తప్పించుకోవచ్చని చేశారో..? వారికే తెలియాలి. టెక్నికల్ గా చరణ్, ఎన్టీఆర్, రాజమౌళిలు గుజరాత్ లో ఉంటే మరి పూణే షెడ్యూల్ ఎలా క్యాన్సిల్ అయిందో?