గత కొన్ని రోజులుగా సీనియర్ హీరోయిన్, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అయిన రమ్య పెళ్లి గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రమ్య తెలుగులో కళ్యాణ్ రామ్ సరసన అభిమన్యుడు చిత్రంలో నటించింది. రమ్య నటించిన ఏకైక తెలుగు చిత్రం ఇదే. తమిళం, కన్నడలో రమ్య పలు చిత్రాల్లో నటించింది. 

స్టార్ హీరో సూర్య సరసన సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రంలో నటించింది. ఇదిలా ఉండగా రమ్య 2013 నుంచి పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్నారు. కర్ణాటకలోని మాండ్య ప్రాంతం నుంచి ఆమె 2013లో ఎంపీగా గెలుపొందారు. 2014లో ఓటమి చెందారు. అప్పటి నుంచి ఆమె కాంగ్రెస్ పార్టీలో నేతగా, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఇంచార్జ్ గా పనిచేస్తున్నారు. 

రాజకీయాలని పక్కన పెట్టి ఆమె త్వరలో తన బాల్య స్నేహితుడు రఫెల్ వివాహం చేసుకోబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె తల్లి రంజిత తాజాగా స్పందించినట్లు తెలుస్తోంది. రమ్య ప్రస్తుతం ఎవరిని వివాహం చేసుకోవడం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. 

రమ్య తల్లి రంజిత మరో ఆసక్తికర విషయాన్ని కూడా వెల్లడించినట్లు తెలుస్తోంది. రమ్య, రఫెల్ మధ్య బ్రేకప్ అయ్యిందట. పెళ్ళైన తర్వాత దుబాయ్ లో స్థిరపడాలనేది రఫెల్ కోరిక. కానీ ఇండియాని విడిచిపెట్టడం రమ్యకు ఇష్టం లేదట. ఈ విషయంలో విభేదాలతో ఇద్దరూ విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.