చాలా కాలం తర్వాత బెల్లంకొండ సురేష్ కుమారుడు శ్రీనివాస్ కు హిట్ దొరికింది.   బెల్లంకొండ శ్రీనివాస్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన చిత్రం ‘రాక్షసుడు’. ఈ చిత్రం తమిళ ‘రాట్చసన్’కు రీమేక్. శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ‘రాక్షసుడు’ బాగానే  ఎంగేజ్ చేయగలిగింది.   అయితే ఒరిజనల్ ని యాజ్ టీజ్ ఫాలో అయ్యాడని, చాలా సన్నివేశాలు కట్ అండ్ పేస్ట్ పద్దతిలో అంటించుకుంటూ వెళ్లిపోయాడని, కేవలం హీరో,హీరోయిన్ ట్రాక్, కొంత ప్యాచ్ వర్క్ మాత్రమే దర్శకుడు చేసాడని టాక్ మీడియాలో మొదలైంది. 

దానికి తోడు వర్షాల ఎఫెక్టో, ఆయన గత చిత్రాల ప్లాఫ్ ప్రభావమో కానీ కలెక్షన్స్ ..టాక్ కు తగినట్లు లేవవు. అయితి  అవి పుంజుకుంటాయనే నమ్మకం ట్రేడ్ లో ఉంది. నిర్మాత పూర్తి ఆనందంగా ఉన్నారు. హీరో ఇప్పటికే పార్టీలు చేసుకుంటున్నారు. మరి డైరక్టర్ మాత్రం  తన రీమేక్ సినిమాపై రాసిన రివ్యూలకు హర్ట్ అయ్యినట్లున్నారు. ఆ విషయం ఆయన మీడియా తో మాట్లాడిన మాటల్లోనే తెలిసిపోతోంది.  తన కాపీ పేస్ట్ కాదంటూ ఆయన మాట్లాడారు. 

దర్శకుడు రమేశ్ వర్మ మాట్లాడుతూ ‘‘నాకు ఇది ఐదో సినిమా. రీమేక్ చేయాలని అనుకోలేదు. కానీ కంటెంట్ నచ్చడంతో ఈ ‘రాక్షసుడు’ని రీమేక్ చేయాల్సి వచ్చింది. తమిళంలో ఈ సినిమా పెద్ద హిట్. ఆ టెంపోని తీసుకుని తెలుగులో ‘రాక్షసుడు’గా తెరకెక్కించాం. కాపీ పేస్ట్ ఈజీ కాదు.. చాలా కష్టం. దేశవ్యాప్తంగా ఎన్నో సినిమాలు రీమేక్ అవుతున్నాయి. అవన్నీ హిట్ కావడంలేదు. కానీ ఈ సినిమా విజయం సాధించింది. ఒరిజినల్‌గా తెరకెక్కించిన దర్శకుడు ఎంత మనసు పెట్టి చేశాడో.. నేను కూడా అంతే శ్రద్ధగా సినిమాను తెరకెక్కించా. కత్తిమీద సాముగా భావించి సినిమా తీశా.. దాని ఫలితంగా సినిమా సక్సెస్ అయింది.

ఇక ఈ సినిమా హక్కుల కోసం చెన్నైలో రెండు నెలలు వెయిట్ చేశా. 11 మంది నిర్మాతలు సినిమా కోసం పోటీ పడ్డారు. నాకు మంచి నిర్మాత దొరికాడు. మరోవైపు మళ్లీ పోలీస్ పాత్ర చేయనని శ్రీనివాస్ చెప్పాడు. అప్పుడు బెల్లకొండ సురేష్‌ను కలిసి తమిళలో తెరకెక్కిన ‘రాట్చసన్’ సినిమాను చూడమన్నా. ఆ సినిమా చూసిన తర్వాత బెల్లకొండ సురేష్ ఫ్యామిలీ ఒప్పుకుంది. ఫైనల్‌గా సినిమా చేశాం.’’ అని అని చెప్పుకొచ్చారు.