రాజమౌళి ఇంకా ఆ ఇంట్లోనే ఉంటున్నారా?

First Published 21, Dec 2017, 11:04 AM IST
Is rajamouli planning a palatial building for his family
Highlights

 ఆ మధ్య వినిపించిన ఫామ్ హౌస్ ఏమయింది?

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమా తరువాత దేశవ్యాప్తంగా జక్కన్న పేరు మారుమ్రోగిపోయింది. ఈ సినిమా విడుదలయ్యి చాలా కాలం గడుస్తున్నా.. ఇప్పటివరకు జక్కన్న తన తదుపరి సినిమాపై క్లారిటీ ఇవ్వలేదు. రీసెంట్ గా ఆయన ఎన్టీఆర్-రామ్ చరణ్ లతో కలిసి మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతున్నాడు.

అయితే ఈ మధ్య కాలంలో రాజమౌళి ఎన్నో ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకుంటున్నట్లు రాజప్రాసాదం లాంటి ఇల్లు నిర్మించుకుంటున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై జక్కన్న ఎప్పుడు నోరు విప్పలేదు. అయితే ఇప్పటికీ కూడా రాజమౌళి తము ఎన్నో ఏళ్ల నుండి ఉంటున్న ఫ్లాట్ లోనే నివాసం ఉంటున్నారు. వారు ఉంటున్న డబుల్ బెడ్ రూమ్ హౌస్ తమకు సరిపోతుందని.. సరిపోని స్థితి ఎప్పుడు ఎదురుకాలేదని అన్నారు రాజమౌళి. బాహుబలి సినిమా దర్శకుడు అయిన చేత పెద్ద ప్యాలస్ లో ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఇక ఫామ్ హౌస్ గురించి ఆయన ఏం చెప్పలేదు.. కానీ తాము ఉంటున్న ఇంటిని వదిలేసి వెళ్ళే అవకాశాలు ఇప్పట్లో లేవని అన్నారు. ఇది వింతగానే అనిపిస్తుంది కదూ. ఎందుకంటే,  ఆయన ఆ మధ్య అమరావతి నిర్మాణంలో కూడా సలహాలందించే పనిలో ఉన్నారు. అసెంబ్లీ ఎలా కట్టాలో కూడా కూడా డిజైన్ గీయించి ఇచ్చారు. ఆయన సొంత ఇల్లు మహిష్మతి రాజాప్రాసాదం లాాగా ఉండొచ్చనుకుంటారు అంతా.... అలా జరగడం లేదు.  అదే వింత.

 

ఇది కూడా చదవండి

బన్నీ  బాక్సింగ్  చేస్తాడట

https://goo.gl/rq2f8N

loader