Asianet News TeluguAsianet News Telugu

డైరెక్టర్ పై నమ్మకం లేదు... ప్రభాస్ ప్రాజెక్ట్ నుండి నిర్మాత అవుట్?

ప్రభాస్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ సందిగ్ధంలో పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. దర్శకుడిపై నమ్మకం లేని నిర్మాత ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. 
 

is producer danayya walk out from prabhas maruthi project
Author
First Published Aug 19, 2022, 9:20 AM IST


బాహుబలి చిత్రాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, బాహుబలి 2 ఇండియన్ బాక్సాఫీస్ ని శాసించాయి. ఆ రేంజ్ విజయాలు చూసిన ప్రభాస్ వరుసగా రెండు ప్లాప్స్ ఎదుర్కొన్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన సాహో, రాధే శ్యామ్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. సాహో కనీసం హిందీలో విజయం సాధించి ప్రభాస్ పరువు నిలబెట్టింది. రాధే శ్యామ్ మాత్రం మొత్తంగా దెబ్బతీసింది. ఈ క్రమంలో కొత్త దర్శకులతో మూవీస్ చేయొద్దని ఫ్యాన్స్ ప్రభాస్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు. 

ఈ క్రమంలో ప్రభాస్(Prabhas) దర్శకుడు మారుతితో మూవీ చేస్తున్నట్లు ప్రకటించడం పెద్ద షాక్ ఇచ్చింది. మారుతితో మూవీ చేయడానికి టూ టైర్ హీరోలు కూడా ఆలోచిస్తారు. అలాంటిది ప్రభాస్ అవకాశం ఎవ్వడమేంటని వాపోతున్నారు. అందులోనూ ఇది ఓ కామెడీ ఎంటర్టైనర్ అట. ఆ విషయాన్ని స్వయంగా ప్రభాస్ చెప్పారు. ఈ పరిణామాలు ఫ్యాన్స్ ని ఆందోళలకు గురి చేస్తున్న తరుణంలో మారుతి లేటెస్ట్ మూవీ పక్కా కమర్షియల్ డిజాస్టర్ అయ్యింది. పక్కా కమర్షియల్ ఫలితం చూశాక ఫ్యాన్స్ కే కాదు నిర్మాత డివివి దానయ్యకు కూడా ఫ్యూజులు ఎగిరిపోయాయట. 

అసలు తలా తోకా లేకుండా తెరకెక్కిన పక్కా కమర్షియల్ లాంటి అవుట్ డేటెడ్ కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ చూశాక..  మారుతి ప్రభాస్ ని హ్యాండిల్ చేయడం కష్టమేనని భావించారట.దీంతో ప్రభాస్-మారుతి ప్రాజెక్ట్ నుండి డివివి దానయ్య తప్పుకున్నట్లు తాజా సమాచారం. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. 

అలాగే ప్రభాస్ ప్రాజెక్ట్ కే, సలార్(Salaar) షూటింగ్స్ తో పాటు ఆదిపురుష్ డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉండడం కూడా ప్రాజెక్ట్ డిలే కావడానికి మరొక కారణమట. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడం కష్టమే అంటున్నారు. అయితే గతంలో కూడా ఇలాంటి పుకార్లే రాగా మారుతి టీమ్ ఖండించారు. ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టిపరేశారు. కాబట్టి దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios