‘ఆదిపురుష్`: 'సాహో' మిస్టేక్ నే ప్రభాస్ రిపీట్ చేస్తున్నారా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూడు భారీ చిత్రాల్లో “ఆదిపురుష్” కూడా ఒకటి.బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కించనున్న చిత్రం రామాయణ ఆధారంగా తెరకెక్కనుంది. ఈ భారీ ప్రాజెక్ట్ లో ప్రభాస్ రామునిగా కనిపించనుండగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ రావణ పాత్రలో కనిపించనున్నారు.
ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తన హోమ్ బ్యానర్ యువి క్రియోషన్స్ లో చేసిన సాహో చిత్రం తెలుగులో ఆడలేదు. నార్త్ లో బాగానే వర్కవుట్ అయ్యింది. అందుకు కారణం ప్రభాస్ ఎనాలసిస్ చేసుకున్నారో లేదో కానీ అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో నిరంతరం డిస్కస్ చేస్తూనే ఉంటున్నారు. కేవలం కంటెంట్ పూర్ గా ఉండటమే కాకుండా ఆ సినిమాలో బాలీవుడ్ జనం ఎక్కువైనందువల్లే సినిమా ఇక్కడ వాళ్ళకు నచ్చలేదని తేల్చారు. అంతేకాకుండా మ్యూజిక్ కూడా మన సౌతిండియన్స్ కు నచ్చేలా లేదని,నార్త్ కు పట్టే పాటలు పెట్టారని విమర్శలు అప్పట్లో వచ్చాయి. అయితే అదే మిస్టీక్ మరోసారి ప్రభాస్ చేస్తున్నాడా అంటే ..చూస్తూంటే అలాగే అనిపిస్తోంది.
వివరాల్లోకి వెళితే...యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూడు భారీ చిత్రాల్లో “ఆదిపురుష్” కూడా ఒకటి.బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కించనున్న చిత్రం రామాయణ ఆధారంగా తెరకెక్కనుంది. ఈ భారీ ప్రాజెక్ట్ లో ప్రభాస్ రామునిగా కనిపించనుండగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ రావణ పాత్రలో కనిపించనున్నారు. అయితే చిత్ర యూనిట్ నుంచి క్యాస్టింగ్ పరంగా ఇవి మాత్రమే అధికారికంగా బయటకొచ్చిన వార్తలు. అయితే అంగద్ బేడీ ఇంద్రజిత్ గా, లక్ష్మణుడి పాత్రకు సోనూకి టిటులీ ఫేం.. బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్‌ని ఎంపిక చేశారు. అధికారికంగా ఎనౌన్స్ చేయటమే ఆలస్యం అంటోంది.
'ఆదిపురుష్'లో సీతగా కృతి సనన్ నటించబోతున్నట్లు కథనాలొస్తున్నాయి. దాదాపుగా నటులంతా బాలీవుడ్ కి చెందిన వారే ..కేవలం ప్రభాస్ తప్ప అంటున్నారు. సౌత్ నుంచి ఆర్టిస్ట్ లు పెద్దగా లేకపోతే మనకు ఇక్కడ ఐడింటిటీ అవ్వటం కష్టం. అయితే పాన్ ఇండియా సినిమా అనుకున్నప్పుడు ఇలాంటి ఎడ్జస్ట్ మెంట్స్ తప్పవు. కానీ ఈ సినిమాని మనవాళ్లు బాలీవుడ్ సినిమాకు తెలుగు డబ్బింగ్ గా భావిస్తేనే సమస్య వస్తుంది. కాబట్టి కాస్తంత ఈ విషయంలో ఆలోచించాల్సిందని ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఆదిపురుష్ త్రిడిని అత్యంత భారీ బడ్జెట్‌తో టీ సిరీస్ నిర్మించనుంది. సుమారు 300 కోట్ల వ్యయంతో టీ సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 2022 ఆగస్ట్ 11న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.