నాగ్ కు కోపం రాదు అంటారు ఆయనతో జర్నీ చేసినవాళ్లు. అయితే ఆయన కోపం దాచుకుంటారు. అవసరం వచ్చినప్పుడు మాత్రమే తన విశ్వరూపం చూపెడతాడు అంటారు సన్నిహితులు. ఎంత మంచివాడికైనా, ఎంత బిజినెస్ మ్యాన్ కు అయినా కొన్ని విషయాల్లో కోపం నశాళానికి అంటుతుంది. దాన్ని నటుడు తన నటనతో దాచి పుచ్చవచ్చేమో కాని, ఎంతోకాలం దాగదు. అలాగే నాగార్జునకు కూడా ఓ డైరక్టర్ పై పిచ్చ కోపం వచ్చిందిట. అయితే ఆ టైమ్ అది ఉగ్గబెట్టుకుని తర్వాత దాన్ని గుర్తు చేస్తూ తన కొడుక్కు క్లియర్ గా చెప్పాడట. ఇప్పటికే అర్దమై ఉంటుంది. ఆ దర్శకుడు ఎవరో..ఇంకెవరు పరుశరామ్.

గీతా గోవిందం సినిమాతో హిట్ కొట్టిన పరుశరామ్ ఆ తర్వాత చాలా కాలం వెయిట్ చేసినప్పటికి పెద్ద హీరోలెవరి డేట్స్ దొరకలేదు. దాంతో ఇంక నా వల్ల కాదులే అనుకుని నాగచైతన్యకు కథ చెప్పి ఒప్పించి ముందుకు వెళ్లటానికి సన్నాహాలు చేసుకున్నాడు. కానీ ఈ లోగా మహేష్ సీన్ లోకి వచ్చాడు. నువ్వు నాతో చేస్తాను అని చెప్పావు కదా..స్క్రిప్టు తెచ్చుకో అన్నాడు. సూపర్ స్టార్ స్వయంగా పిలిస్తే కాదనేదేముంది. సర్వం వదిలేయచ్చు అనకున్నాడు. అందుకు తగినట్లే వెల్లి నాగ్ తో విషయం చెప్పారట. కానీ నాగ్ తెలివైన వాడు. ఈ విషయంతో తనకూ మహేష్ కు చెడకూడదు అనుకున్నాడు. దాంతో బెస్టాఫ్ లక్ చెప్పాడట. 

కానీ తన కొడుకు కు అనుకున్న ప్రాజెక్టు వేరే వారితో చేయటం మాత్రం తట్టుకోలేని విషయమే. అదే విషయం చైతూ తో డిస్కస్ చేసాడట. జీవితంలో పొరపాటున కూడా పరుశరామ్ ని ఎంకరేజ్ చేయద్దని చెప్పారట. ఆ దర్శకుడుని బ్లాక్ లిస్ట్ లో పెట్టమన్నాడట. తను కానీ తన కొడుకులిద్దరూ కానీ, తమ అన్నపూర్ణ బ్యానర్ లో కానీ ఆ దర్శకుడుతో సినిమా చేయటానికి వీల్లేదని అన్నారట.

 అంతేకాదు అతని సినిమా రిలీజ్ నాటికి నువ్వో సినిమా చేసి హిట్ కొట్టి పోటి ఇవ్వాలి, అదీ స్పిరిట్ అని చైతుకు ధైర్యం చెప్పాట. ఇలా నాగ్ మాట్లాడటం వాళ్లందరినీ ఆశ్చర్యపరిచిందిట. తన సినిమాలే ఎన్నో సార్లు కాన్సిల్ అయినా పట్టించుకోని నాగ్ తన కొడుకు సినిమా కాన్సిల్ అయ్యేసరికి తట్టుకోలేకపోయాడంటున్నారు. అయితే ఇదంతా ఫిల్మ్ సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం..ఇందులో ఎంతవరకూ నిజముంది అనేది తెలియాల్సిన సంగతి.