Asianet News TeluguAsianet News Telugu

'ల‌వ్ స్టోరి' కు ఫస్ట్ ఛాయిస్ ఆ మెగా హీరోనే, నో చెప్పాడు

 నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన లవ్ స్టోరీ మంచి బజ్ ను క్రియేట్ చేస్తూ.. ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా లవ్ స్టోరీ కచ్చితంగా ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్స్ వైపు అడుగులేయించ‌డంలోనూ స‌క్సెస్ అయ్యింది.

Is Love story  first choice for Panja Vaishnav Tej
Author
Hyderabad, First Published Sep 28, 2021, 12:18 PM IST

అక్కినేని నాగ చైతన్య- సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల రూపొందించిన 'లవ్ స్టోరీ' మూవీ కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 24 (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా  ఫస్ట్ వీకెండ్ లో చెప్పుకోదగిన వసూళ్లు రాబట్టింది. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి అన్ని ఏరియాల్లో ప్రేక్షకుల మద్దతు లభిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నాగ చైతన్య 'లవ్ స్టోరీ' హవా నడుస్తోంది.   ఈ సినిమాలో ఆ మధ్య విడుదలైన తెలంగాణ జానపదం ‘సారంగ దరియా’ సాంగ్ మరో రేంజ్‌ కు తీసుకెళ్ళింది. ఈ పాట ఇప్పటికే  మూడు వందల మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి యూట్యూబ్ లో‌ కొత్త రికార్డులు సృష్టించింది. నాగ‌చైత‌న్య కెరీర్‌లో ఇదే పెద్ద  హిట్.ఈ నేపధ్యంలో చిత్రం కు సంభందించిన విశేషాలపై  ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాని కొత్త వాళ్ల‌తో, త‌న పంథాలో ఓ సినిమా చేయాల‌ని మొదలెట్టారు. కానీ మూడు వంతులు పూర్తి చేసాక నచ్చక ఆ ఫుటేజీని ప్రక్కన పెట్టి హీరో కోసం అన్వేషించారు.అలా కొందరు యంగ్ హీరోలకు వినిపించారు. అలా మెగా మేనల్లుడు వేష్ణవ్ తేజ్ దగ్గరకు కథ వెళ్లింది. అయితే తను చేస్తున్న ఉప్పెన కూడా కులాంతర ప్రేమ కథే కావటంతో వద్దని చెప్పాడు. అలా శేఖర్ కమ్ముల కు నో చెప్పారు. అప్పుడు నాగచైతన్య దగ్గరకు కథ వెళ్లింది. అతను ఒప్పుకోవటంతో కథ పట్టాలు ఎక్కింది. 
 
ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఊహకందని ఊచకోత కోసింది. ఈ సినిమా మొదటి రోజున 6.94 కోట్ల రేంజ్ షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా కూడా అదిరిపోయే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 9.66 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 16.8 కోట్ల మార్క్ ని అందుకుంది. లవ్ స్టొరీ సినిమా రెండో రోజు అల్టిమేట్ కలెక్షన్స్ ని సాధించింది… ఈ సినిమా రెండో 4 కోట్లకు పైగా షేర్ ని అందుకోవడం ఖాయం అనుకోగా సినిమా అంతకు మించి కలెక్షన్స్ ని సాధించి ఏకంగా 5 కోట్ల మార్క్ ని అందుకుంది. ఈ సినిమా నైజాంలో అదిరగొడుతోంది.

లవ్ స్టొరీ వరల్డ్ వైడ్ గా 1000 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది.  లవ్ స్టోరిని నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా నిర్మించారు. పవన్ చిల్లం ఈ సినిమాకు సంగీతం అందించారు. రావు రమేష్, దేవయాని, ఉత్తేజ్, ఈశ్వరీరావు ముఖ్యమైన పాత్రలను పోషించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios