Asianet News TeluguAsianet News Telugu

కత్తి మహేష్ కి కరోనా..?: అసలు విషయం ఇది

సెలబ్రెటీలలో కొందరికి కరోనా రాకపోయినా రకరకాల కారణాలతో వారంటే ఇష్టంలేని వారు రూమర్స్ స్ర్పెడ్ చేయటం మొదలెడుతున్నారు. అయితే ఆ రూమర్స్ వారిని అభిమానించే వారిని, వారి కుటుంబాలని ఎంతగా ఇబ్బంది పెడతారో ఊహించుకోవటం లేదు. రేపు తమకూ ఇలాంటి పరిస్దితి వస్తే ఏమిటని ఆలోచించటం లేదు. తాజాగా ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేష్ పై ఇలాంటి రూమర్ నే ప్రచారంలోకి తెచ్చారు. 

Is Kathi Mahesh tests positive for coronavirus?
Author
Hyderabad, First Published Jul 2, 2020, 4:15 PM IST

ఫలానా వారికి కరోనా వచ్చింది...అంటూ మీడియాలో రావటం అతి సాధారణం అయ్యిపోయింది. అయితే మీడియాలో వచ్చిన ప్రతీ వార్త నమ్మదగినదేనా...అంటే కొన్ని ఫేక్ వార్తలు సైతం మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సెలబ్రెటీలలో కొందరికి కరోనా రాకపోయినా రకరకాల కారణాలతో వారంటే ఇష్టంలేని వారు రూమర్స్ స్ర్పెడ్ చేయటం మొదలెడుతున్నారు. అయితే ఆ రూమర్స్ వారిని అభిమానించే వారిని, వారి కుటుంబాలని ఎంతగా ఇబ్బంది పెడతారో ఊహించుకోవటం లేదు. రేపు తమకూ ఇలాంటి పరిస్దితి వస్తే ఏమిటని ఆలోచించటం లేదు. తాజాగా ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేష్ పై ఇలాంటి రూమర్ నే ప్రచారంలోకి తెచ్చారు. 

తాజాగా ఈ మహమ్మారి బారిన కత్తి మహేష్ పడ్డట్లు సోషల్ మీడియాలోనే కాక వెబ్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలో ఒక షో నిర్వాహకుడిగా పనిచేస్తున్న కత్తి మహేష్ కు కరోనా రావడంతో సదరు ఛానల్లోని ఉద్యోగులు భయపడిపోతున్నారని ఆ వార్తల సారాంశం. అయితే ఈ విషయమై కత్తి మహేష్ వెంటనే స్పందించారు. అలాంటిదేమీ లేదని, ఎవరూ కంగారుపడవద్దని ,తాను సంపూర్ణ ఆరోగ్యవంతుడుగానే ఉన్నానని తేల్చి చెప్పారు. అలా ప్రచారం చేస్తున్నవారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించారు.

అంతేకాకుండా రేపటి నాడు నిజంగా అలాంటి పరిస్దితే వస్తే ఎదుర్కోవటానికి సిద్దంగా ఉన్నానని చెప్పారు. తనపై శునకానందంతో చేసే ఇలాంటి ప్రచారాలు మానుకోమని హితువు పలికారు. తనకు కరోనా రావాలని ఈ ప్రచారం చేసే వాళ్ళు కోరుకుంటన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. 

ఏదైమైనా ఇలాంటి విపత్కర పరిస్దితుల్లో ఇలాంటి దారుణమైన ప్రచారాలు చేయటం పద్దతి కాదు. ఏదైనా వ్యకిరేకత ఉంటే దాన్ని వేరే విధంగా చూసుకోవాలి కానీ ఇలా ఆరోగ్యం విషయంలో ప్రచారాలు చెయ్యకూడదు. ఇప్పటికే కరోనా వైరస్ తో తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో జనం హడలెత్తిపోతున్నారు. రెండు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవటం, సెలబ్రెటీలు, రాజకీయనాయకులు కరోనా పాజిటివ్ రావటం వార్తల్లో నిలుస్తోంది.  అంతేకాదు మీడియా సంస్థల్లో కూడా కరోనా ప్రభావం అధికంగానే ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండటం అవసరం.

Follow Us:
Download App:
  • android
  • ios