అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తుంది పుష్ప. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్ లో పలు భాషలలో విడుదల కానుంది. దర్శకుడు సుకుమార్ లాక్ డౌన్ కి ముందు కేరళలో ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. అల వైకుంఠపురంలో మూవీ ప్రమోషన్స్ లో ఉన్న బన్నీ ఆ షెడ్యూల్ నందు పాల్గొనలేదు. తీరా బన్నీ సిద్ధం అయ్యేనాటికి లాక్ డౌన్ మొదలైపోయింది. స్థానిక అడవుల్లో మూవీ షూటింగ్ నిర్వహించే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నారు. 

రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ పుష్ప తెరకెక్కించనుండగా బన్నీ రాయలసీమ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ పాత్ర చేస్తున్నారు. ఈ మూవీలో బన్నీది డీగ్లామర్ రోల్ గా తెలుస్తుంది. కాగా ఈ మూవీలో విలన్ గా నటుడు జగపతి బాబు నటిస్తున్నారంటూ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. ఇప్పటికే జగపతి బాబుతో సంప్రదింపులు జరిపిన విలన్ గా కన్ఫర్మ్ చేసేశారని వినికిడి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. 

సుకుమార్ కెరీర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన రంగస్థలం మూవీలో విలన్ గా జగపతి బాబు చేసిన సంగతి తెలిసిందే. ఊరి పెద్ద పశుపతి పాత్రలో ఆయన నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది. మరి పుష్ప మూవీలో కూడా విలన్ పాత్ర చాలా కీలకం కాగా జగపతి బాబునే ఫైనల్ చేశారని అంటున్నారు. ఈ విషయంపై స్పష్టత రావాలంటే మరి కొద్దిరోజు ఆగాల్సిందే. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ అందిస్తున్నారు.