ఎన్టీఆర్,త్రివిక్రమ్ ప్రాజెక్టు, ఈ న్యూస్ ఏదో తేడాగా ఉందే

ఎన్టీఆర్ ఇప్పుడు తను పొలిటికల్ ఇష్యూలు టచ్ చేయదలుచుకోలేదని, తనపై పొలిటికల్ ఎక్సపెక్టేషన్స్ పెంచటం ఇష్టం లేదని , వేరే స్క్రిప్టు చేద్దామని చెప్పారట. దాంతో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ ని త్రివిక్రమ్ రెడీ చేసారట. 

is it true? NTR and Trivikram Project Shelved? jsp

 అర‌వింద‌స‌మేత వీరరాఘ‌వ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందబోయే  చిత్రం గురించి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, హారిక అండ్ హాసిన క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా రూపొంద‌నుంది. గ‌త ఏడాది అల వైకుంఠ‌పుర‌ములో సినిమాతో నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను క్రియేట్ చేసిన త‌ర్వాత త్రివిక్ర‌మ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై మరన్ని అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడో కొత్త వార్త మీడియాలో హల్ చల్ చేస్తూ అభిమానులను కంగారుపెడుతోంది. అందులో నిజమెంతో తెలియదు కానీ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది. ఆ న్యూస్ ఏమిటంటే...

ఎన్టీఆర్ కు, త్రివిక్రమ్ కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, దాంతో ప్రాజెక్టు పట్టాలు ఎక్కటం కష్టమేనని ఆ వార్తల సారాంశం. మొదట త్రివిక్రమ్ ఓ పొలిటికల్ సెటైర్ స్క్రిప్టుని మంత్రిగారి వియ్యంకుడు ఫార్మెట్ లో  ప్రిపేర్ చేసారట. అయితే ఎన్టీఆర్ ఇప్పుడు తను పొలిటికల్ ఇష్యూలు టచ్ చేయదలుచుకోలేదని, తనపై పొలిటికల్ ఎక్సపెక్టేషన్స్ పెంచటం ఇష్టం లేదని , వేరే స్క్రిప్టు చేద్దామని చెప్పారట. దాంతో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ ని త్రివిక్రమ్ రెడీ చేసారట. అయితే ఆ స్క్రిప్టు సైతం ఎన్టీఆర్ ని పూర్తిగా ఇంప్రెస్ చేయలేదట. గత కొంతకాలంగా మార్పులు చేర్పులు చేసి అలిసిపోయారని అంటున్నారు. దాంతో మహేష్ బాబు వైపుకు త్రివిక్రమ్ వెళ్తున్నారని చెప్తున్నారు. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సింది. ఇది కేవలం రూమర్ కావచ్చు అని కొందరు అంటున్నారు. ఏదైమైనా ఉగాది రోజు త్రివిక్రమ్ కొత్త ప్రాజెక్టు ఎనౌన్స్ మెంట్ వస్తుంది. 
 
మరో ప్రక్క ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్(రౌద్రం ర‌ణం రుధిరం) సినిమాను పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. అన్ని అనుకూలిస్తే.. ఈ సినిమా పూర్తి చేయ‌గానే స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తారు. ఈ ఏడాదిలోనూ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌డానికి రంగం సిద్ధ‌మ‌వుతుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవ‌రు న‌టిస్తారు? అనే దానిపై చాలా ర‌కాల వార్త‌లు వినిపించాయి.

 పూజా హెగ్డే, ర‌ష్మిక మంద‌న్న పేర్ల‌తో పాటు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ పేరు కూడా ప్ర‌ముఖంగా వినిపించింది.  బాలీవుడ్‌లో ల‌వ్‌యాత్రి సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన వ‌రీన హుస్సేన్ ఎన్టీఆర్ 30లో న‌టించ‌నుంద‌ట‌. ఇప్ప‌టికే లుక్ టెస్ట్స్‌, ఆడిష‌న్స్ పూర్త‌య్యాయ‌ని అంటున్నారు. ఎన్టీఆర్ 30 ప్రారంభం కాగానే... వివ‌రాలు ప్ర‌క‌టిత‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయంటున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios