హైపర్ ఆదిపై దాడి జరిగిందా?నిజమెంత?
ఓ ఇంటర్వ్యూ లో విష్ణు చేసిన కామెంట్స్ ను ఇమిటేట్ చేస్తూ హైపర్ ఆది స్కిట్ లో జోకులు పేల్చాడు. మరికొన్ని వ్యాఖ్యలు మంచు లక్ష్మి వి తీసుకుని స్కిట్ కొనసాగించాడు. మాటల తూటాలు పేల్చాడు. దీంతో ఆదిపై మరోసారి వార్తల్లో నిలిచాడు.
జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది(Hyper Aadi) ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఏదో ఒక వివాదాల్లో ఉంటూ వస్తున్నారు. తన పంచ్ లతో అందరిని ఆకట్టుకునే ఆది తన స్కిట్లలో ఎవరినైనా టార్గెట్ చేస్తూ నవ్వించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ నేపథ్యంలో అనేక మంది చేత మాటలు పడ్డా తాను అనుకున్నది చేయడానికి ఎప్పుడు వెనకాడరు. ఇప్పటికే పలు మార్లు వివాదాల్లో పడినా తన పంథా మాత్రం మార్చుకోలేదు. నవ్వించేందుకే ప్రాధాన్యం ఇస్తూంటానని,కావాలని ఏదీ చేయనని కామెడీ కోసం దేనికైనా సిద్ధమేనని చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఓ వివాదంలో ఆయన ఇరుక్కున్నారు.
వివరాల్లోకి వెళ్తే...Jabardasth కమెడియన్ హైపర్ ఆది పై మంచు విష్ణు(Manchu Vishnu) అభిమానులు దాడి చేసినట్టు సోషల్ మీడియాలో పోస్టులు కనపడుతున్నాయి. మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా దీపావళి సందర్భంగా హైపర్ ఆది Manchu Vishnu ను ఇమిటేట్ చేస్తూ ఓ స్కిట్ చేశారు. దానికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో… మా ఎన్నికల సమయంలో మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతుండగా జరిగిన సంభాషణను…అదే విధంగా ఓ ఇంటర్వ్యూ లో విష్ణు చేసిన కామెంట్స్ ను ఇమిటేట్ చేస్తూ Hyper Aadi స్కిట్ లో జోకులు పేల్చాడు. మరికొన్ని వ్యాఖ్యలు మంచు లక్ష్మి వి తీసుకుని స్కిట్ కొనసాగించాడు. మాటల తూటాలు పేల్చాడు. దీంతో ఆదిపై మరోసారి వార్తల్లో నిలిచాడు.
దీనిపై నెటిజన్స్... డైపర్ ఆదిగాడిని డైపర్ చినిగేలా కొట్టారటగా అని ఒకరంటే.. మీవి చీప్ పే టీమ్ బ్యాచ్.. ఎప్పుడు ఎవర్ని కొడదామా అనే కదా వెయిట్ చేస్తుంటారు అని రివర్స్ కౌంటర్.. వేసుకుంటున్నారు. మరో ప్రక్క మంచు విష్ణు అభిమానులు హైపర్ ఆది పై దాడి చేశారని ప్రచారం జరుగుతోంది. స్కిట్ చేసినందుకు విష్ణు కు సారీ చెప్పాలని కోరారని అయితే దానికి హైపర్ ఆది నిరాకరించారని దాంతో అభిమానులు దాడి చేశారని అంటున్నారు.
అయితే అందులో నిజమెంత అనేది మాత్రం తేలలేదు.దీన్ని నిర్దారిస్తున్నట్లుగా దీపావళి సందర్భంగా ప్రసారమైన ఎపిసోడ్ లో హైపర్ ఆది మంచు విష్ణు పై చేసిన కామెంట్లను తొలగించారు. ఏదైమైనా వివాదాలకు దూరంగా ఉండే మల్లెమాల ప్రొడక్షన్ మా అధ్యక్షుడిని టార్గెట్ చేస్తూ స్కిట్ చేయడంపై స్పందించకపోవడం యాదృచ్ఛికమేమీ కాదు. అంతా సెన్సేషనే. ఏదైమైనా హైపర్ ఆది మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు.
related news: మంచు విష్ణుపై రెచ్చిపోయిన హైపర్ ఆది.. కామెడీ పంచ్ లతో దారుణంగా ట్రోలింగ్, వ్యవహారం ముదిరితే..