స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి సరైన కథలు దొరకడం లేదు. తన తోటి హీరోలకి బ్లాక్ బస్టర్ కథలు దొరుకుతుంటే బన్నీకి మాత్రం ఎందుకు రావడం లేదనే ప్రశ్న ఎదురవుతుంది. కమర్షియల్ హీరోకి కావాల్సిన అన్ని లక్షణాలు బన్నీలో ఉన్నాయి.

సరైన కథ దొరికితే వంద కోట్ల క్లబ్ లోకి చేరే సత్తా కూడా ఉంది. మరి ఏది అతడికి సక్సెస్ రాకుండా ఆపేస్తుందనే విషయంలో కొన్ని ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు కాంపౌండ్ లో కొందరు వ్యక్తుల సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్ కి మంచి కథలు రాకపోవడానికి కారణం దర్శకుడు మారుతి అని సమాచారం.

అల్లు క్యాంప్ లోకి ఎవరు కథతో ఎంటర్ అయినా.. ముందుగా ఆ కథను బన్నీ వాసు విని మారుతికి పంపిస్తాడు. ఆ కథ మారుతికి నచ్చకపోతే బన్నీ వాసు కూడా పక్కన పెట్టేస్తాడట. కొత్త దర్శకులు, యంగ్ డైరెక్టర్స్ కొందరు బన్నీ కోసం ఎగ్జైటింగ్ కథలు తీసుకొచ్చినప్పటికీ అవి అల్లు అర్జున్ వరకు రీచ్ అవ్వడం లేదని తెలుస్తోంది.

ఆ విధంగా బన్నీకి సరైన కథలు దొరకక మూస ధోరణిలో పడిపోతున్నాడని అంటున్నారు. ప్రస్తుతం బన్నీ.. దర్శకుడు త్రివిక్రమ్ తో సినిమా చేయాలనుకుంటున్నాడు. కథ ఇంకా ఫైనల్ కాకపోవడంతో ఇప్పటివరకు సినిమాకి సంబంధించిన ప్రకటన చేయలేదని తెలుస్తోంది.