బిగ్ బాస్ సీజన్ 4 చివరి దశకు చేరుకుంది. మరో వారం రోజులలో టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఇక హౌస్ లో ఉన్న ఆరుగురు సభ్యులలో అఖిల్, సోహైల్ ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. టికెట్ టు ఫినాలే గెలిచిన అఖిల్ నేరుగా ఫైనల్ కి చేరుకోగా, ఎలిమినేషన్ నుండి సేవ్ అయ్యి... సోహైల్ ఫైనల్ కి చేరినట్లు నాగార్జున ప్రకటించారు. ఇక నామినేషన్స్ లో ఉన్న అభిజీత్, హారిక, మోనాల్ మరియు అరియానాలలో ముగ్గురు ఫైనల్ కి ఒకరు ఇంటికి వెళ్లనున్నారు. 
 
కాగా నిన్న బిగ్ బాస్ హౌస్ లో ఓ టాస్క్ నిర్వహించడం జరిగింది. బిగ్ బాస్ సీజన్ 4 ప్రజెంటర్స్ లో ఒకరిగా ఉన్న స్కందాన్షి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వారు ఓ గేమ్ నిర్వహించడం జరిగింది. ఇంటి సభ్యులను రెండు టీమ్స్ గా విభజించి బజర్ మోగగానే... అక్కడ ఉన్న షీట్స్ తో ఇల్లు నిర్మించాలి అన్నారు. ఈ టాస్క్ లో అఖిల్, సోహైల్ మరియు మోనాల్ టీమ్ ముందుగా హౌస్ నిర్మించి గేమ్ గెలిచారు. దీనితో హౌస్ లోని వారందరికీ వారి పేరు రాసి ఉన్న మెమెంటోలను స్కందాన్షి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వారు ఇవ్వడం జరిగింది. 
 
ఆ మెమెంటో చూసిన అఖిల్, సోహైల్ ఎక్సయిట్మెంట్ ఫీలయ్యారు. మెమెంటో చాలా బాగుంది అన్నారు. అలాగే హౌస్ నుండి బయటికి వచ్చిన తరువాత డిస్కౌంట్స్ ఇస్తే ఇల్లు కొనుక్కుంటాం అని సదరు సంస్థకు చెప్పారు. మరి ఇల్లు కొనడం అంటే లక్షలతో కూడిన వ్యవహారం. దీనితో బిగ్ బాస్ హౌస్ లో చివరి వరకు చేరిన అఖిల్, సోహైల్ లక్షల్లో ఆర్జించారా అనే సందేహం కలుగుతుంది. వీరికి బిగ్ బాస్ నిర్వాహకులు భారీగానే చెల్లిస్తున్నారన్న అనుమానం మొదలైంది ప్రేక్షకులలో.