సాధారణంగా బాలకృష్ణ స్పీడు మామూలుగా ఉండదు. ఆయన సీన్ లోకి దిగారంటే చాలు...వెంటనే కథ వినటం, నస పెట్టకుండా ప్రాజెక్టు ఓకే చేసి, షూటింగ్ పూర్తియటం, అనుకున్న సమయానికి సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సిందే. గత సంవత్సరం ప్రారంభంలోనూ చివర్లోనూ బాలయ్యకు పెద్ద ఎదురుదెబ్బలే తగిలాయి. దాంతో బాలయ్య ప్రతీ విషయంలోనూ ఆచి,తూచి అడుగులు వేస్తున్నారు. మారుతున్న కాలంలో యూత్ తో పోటీ పడాలంటే తగినన్ని జాగ్రత్తలు స్క్రిప్టు,షూటింగ్ విషయాల్లో పడాలని నిర్ణయించుకున్నారు. 

తనలాంటి స్టార్ తో భారీ బడ్జెట్ లు చేసేటప్పుడు మరింత అప్రమత్తతో లేకపోతే చాలా నష్టం వస్తుందు ప్రాక్టికల్ గా అర్దమైంది. ఈ నేపధ్యంలో తన కెరీర్ లో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన  ప్రస్తుతం బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమా మాత్రమే ఓకే చేసి, షూటింగ్ మొదలెట్టారు బాలకృష్ణ. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో  ఆ తర్వాత సినిమాకి కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.  ఈ క్రమంలో ఓ వార్త బయిటకు వచ్చింది. 

రీసెంట్ గా  ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ‘అయ్యప్పానుమ్‌ కొషియుమ్‌’ అనే మలయాళ చిత్ర రీమేక్‌ హక్కులు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్‌ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో నందమూరి బాలకృష్ణతో చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌ నడిచింది. అలాగే  ఈ సినిమాలో మరో పాత్ర కోసం యంగ్ హీరో రానాను సంప్రదిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా రీమేక్‌ విషయమై రానాతో సితార టీమ్ చర్చలు కూడా పూర్తి చేసిందని టాక్‌. త్వరలోనే దర్శకుడిని కూడా ఎంపిక చేయనున్నారట. ఈ క్రమంలో బాలయ్యకు ఈ విషయం తెలియచేసి,మీ అభిప్రాయం చెప్పమన్నారట. అయితే బాలయ్య నిర్మహమాటంగా తాను చేయనని చెప్పేసారట. 

ప్రస్తుతం బోయపాటి సినిమాపైనే దృష్టి ఉందని చెప్పిన ఆయన వేరే ప్రాజెక్టు గురించి ఆలోచించను అన్నారట. అయితే బాలయ్యకు సోలో సినిమాలపైనే దృష్టి ఉందని, తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా ఇలాగే రానా తో కలిపి చేసామని, అవేమీ వర్కవుట్ కాలేదని, పెద్ద క్రేజ్ కూడా క్రియేట్ కాలేదని నమ్ముతున్నారట. అయినా రీమేక్ లో చేస్తే ఒరిజనల్ హీరోతో పోల్చి చూస్తారని, హిట్టైనా కలిసి వచ్చేదేమీ లేదని భావిస్తున్నట్లు సమాచారం. 

గత కొంతకాలంగా  కరోనా ప్రభావంతో సినిమా షూటింగ్‌లేవీ జరగడం లేదు. ఇప్పటికే కొంత మేర  షూటింగ్ లు పూర్తి చేసుకున్న సినిమాలకు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుండగా, దర్శకులు, హీరోలు కొత్త సినిమా కథల ఎంపికలో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే పలువురు నిర్మాతలు కొత్త కథలను సిద్ధం చేసి పెట్టుకుంటున్నారు.