Asianet News TeluguAsianet News Telugu

Allu Arjun: అల్లు అర్జున్ మెగా హీరో కాదట... ఆ మీటింగ్ తో తేల్చేశారు!


విజయవాడ వేదికగా జరిగిన మెగా అభిమానుల మీటింగ్ కొత్త చర్చకు దారి తీసింది. మెగా అభిమానుల ఆత్మీయ సమ్మేళనం కోసం రూపొందించిన బ్యానర్ లో అల్లు అర్జున్ ఫోటో లేకపోవడం ఆసక్తికరంగా మారింది. 
 

is allu arjun not a mega hero what is the meaning of that meeting
Author
Hyderabad, First Published May 23, 2022, 10:05 AM IST

చిత్ర పరిశ్రమలో చిరంజీవి(Chiranjeevi) ఓ వటవృక్షం. ఆ కుటుంబానికి చెందిన చాలా మంది హీరోలు ఆ చెట్టు నీడలో ఎదిగారు. చిరంజీవి స్టార్ గా ఎదిగాక ఓ సామాజిక వర్గం ఆ ఫ్యామిలీని అక్కున చేర్చుకుంది. తమ జాతికి గుర్తింపు తెచ్చిన వ్యక్తిగా చిరంజీవిని వాళ్ళు చూశారు. సామాజిక సమీకరణాల్లో ఈ వర్గం మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. ఆ ఫ్యామిలీ నుండి పదుల సంఖ్యలో హీరోలు పుట్టుకురావడానికి, వాళ్ళు ఎదగడానికి గల కారణాల్లో అది కూడా ఒకటి. 

టాలీవుడ్ లో ఉన్న టాప్ స్టార్స్ లో సగం ఆ ఫ్యామిలీ నుండే వున్నారు. చిరంజీవి తర్వాత పవన్ (Pawan Kalyan), రామ్ చరణ్, అల్లు అర్జున్ స్టార్ హోదా దక్కించుకున్నారు. వరుణ్ తేజ్, ధరమ్ తేజ్ కూడా ఓ స్థాయి హీరోలుగా మార్కెట్ ఏర్పరుచుకున్నారు. చిరంజీవి కంటే ముందే టాలీవుడ్లో ప్రస్థానం మొదలుపెట్టిన నందమూరి, అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీలు ఈ విషయంలో ఎక్కడో ఉన్నాయి. ఒకరిద్దరు స్టార్స్ కూడా ఈ కుటుంబాల నుండి ఎదగలేదు. 

ఇదిలా ఉంచితే అల్లు అర్జున్ (Allu Arjun)మెగా హీరో కాదా అనే కొత్త చర్చ మొదలైంది. విజయవాడలో చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాల అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన బ్యానర్ లో అల్లు అర్జున్ ఫోటో లేదు. అలాగే ఆయన ఫ్యాన్స్ కి ఆహ్వానం కూడా లేదు. ఈ క్రమంలో అల్లు అర్జున్ని మెగా హీరో కేటగిరీ నుండి తొలగించినట్లైంది. పరోక్షంగా మెగా హీరో ట్యాగ్ అల్లు అర్జున్ కి వర్తించదని నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదేదో ఆషామాషీ అనామకులు సమావేశం కూడా కాదు. ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి నాయుడు ఆధ్వరంలో జరిగిన మీటింగ్. 

ఈ పరిణామం నిజంగా మెగా ఫ్యాన్స్ లో చీలిక తెచ్చేదే. అయితే అల్లు అర్జున్ కోరుకుంటుంది కూడా ఇదే కావడం గమనార్హం. గత ఐదేళ్లలో అల్లు అర్జున్ ఇమేజ్ భారీగా పెరిగింది. కేరళలో కూడా ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్న ఏకైన హీరో. పుష్ప మూవీతో హిందీలో కూడా అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన మెగా హీరో అని పిలిపించుకోవడానికి ఇష్టపడడం లేదు. దానికి ఓ బలమైన కారణం కూడా ఉంది. తన తాత అల్లు రామలింగయ్య చిరంజీవి కంటే ముందే నటుడిగా, నిర్మాతగా టాలీవుడ్ లో బలమైన శక్తిగా ఎదిగారు. అసలు చిరంజీవి అల్లు రామలింగయ్య అల్లుడు కావడం వలనే స్టార్ అయ్యాడనే వాదన కూడా ఉంది. 

కాబట్టి చిరంజీవి నీడలో ఎదిగిన హీరో అనే గుర్తింపు అల్లు అర్జున్ కి నచ్చడం లేదు. అందుకే ఆయన 'AA' అంటూ ఓ బ్రాండ్ నేమ్, లోగో రూపొందించుకున్నారు. గతంలో పవన్ ఫ్యాన్స్ తో తలెత్తిన వివాదాలు కూడా మెగా బ్రాండ్ కి దూరం కావాలనే ఆలోచనలకు బలం చేకూర్చింది. పవన్, చిరంజీవి, రామ్ చరణ్ అభిమాన సంఘాలు అల్లు అర్జున్ పేరు లేకుండా మెగా అభిమానుల ఆత్మీయ సమ్మేళనం అంటూ నిర్వహించడంతో... గ్రౌండ్ లెవెల్ లో కూడా అల్లు అర్జున్ తో వాళ్ళు ఓ గ్యాప్ మైంటైన్ చేస్తున్నారని అర్థం అవుతుంది. ఇక ఆ కుటుంబాన్ని ఆరాధించే డై హార్డ్ ఫ్యాన్స్ కి ఈ పరిణామాలు సహించడం లేదు. మెగా హీరోలు అందరూ కలిసుండాలని కోరుకుంటున్నారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios