నేడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్విటర్ లో సందడి చేస్తున్నారు.  ఇండియన్ స్టైలిష్ ఐకాన్ అల్లు అర్జున్ అనే యాష్ ట్యాగ్ ని భారీగా ట్రెండ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ మొత్తం ట్వీట్స్ తో విరుచుకుపడంతో ఈ యాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. సమయం సంధర్భం లేకుండా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో తమ హీరోని ఎందుకు ట్రెండ్ చేస్తున్నారో అర్థం కాలేదు. 

లోతుగా ఆలోచిస్తే దీని వెనుక పరమార్ధం అర్థం అవుతుంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో. భారీ అంచనాల మధ్య విడుదలైన పాన్ ఇండియా చిత్రం మిక్స్డ్ ఫలితాలు అందుకుంది. టాలీవుడ్ లో యావరేజ్ టాక్ తో సరిపెట్టుకున్న ఈ చిత్రం బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలింది. ఆగస్టు 30, 2019న విడుదలైన ఈ చిత్రం విడుదలై సరిగ్గా ఏడాది అవుతుంది. 

దీనితో ప్రభాస్ అభిమానులు సాహో యానివర్సరీని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రభాస్ మరియు సాహూ యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ప్రభాస్ బాలీవుడ్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోగా మూడు సినిమాలతో నిరూపించుకోగా, తమ హీరో ఏమి తక్కువకాదని నిరూపించే ప్రయత్నం బన్నీ ఫ్యాన్స్ చేస్తునట్లు తెలుస్తుంది. ప్రభాస్ కంటేతమ హీరో బన్నీ ఫాలోయింగ్ ఎక్కువని నిరూపించడం కోసమే ఫ్యాన్స్ ట్విట్టర్ పై దండెత్తినట్లు సమాచారం.