ఈ సోషల్ మీడియా రోజుల్లో ప్రతీ చిన్న విషయం మీదా పెద్ద రచ్చ జరుగుతోంది. ముఖ్యంగా సెలబ్రెటీలు, సినిమా హీరోల విషయంలో అది మరీ మితిమీరిపోతోంది. ఇప్పుడు అఖిల్ కొత్త చిత్రం విషయంలోనూ గత కొద్ది రోజులుగా ఓ చర్చ జరుగుతోంది. అల్లు అరవింద్ తమ హీరోను ఇన్సల్ట్ చేస్తున్నారని కొందరు అభిమానులు ఫీలవుతూ పోస్ట్ లు పెడుతున్నారు.

అయితే ఏ విషయంలో అంటే.. అల్లు అరవింద్ నిర్మాతగా అక్కినేని అఖిల్ హీరోగా ఓ చిత్రం రూపొందించటానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందే ఆ చిత్రం అఖిల్ బిజినెస్ స్దాయిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ కంట్రోలులో సినిమా చెయ్యాలని ఫిక్స్ అయ్యారట. ఈ విషయంలో అఖిల్ కు,నాగ్ కు ఏ సమస్యా లేదు. కానీ అభిమానులకు మాత్రం నచ్చటం లేదు. 

దానికి తోడు అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని తమ గీతా ఆర్ట్స్ పై కాకుండా GA2 పిక్చర్స్ బ్యానర్ పై చేస్తామంటున్నారు గీతా ఆర్ట్స్ పై కేవలం ప్రెస్టేజియస్ గా ఉండే పెద్ద ప్రాజెక్టులు మాత్రమే చేస్తానని, మీడియం రేంజి సినిమాలు అన్ని తమ కొత్త బ్యానర్ GA2 లోనే చేస్తానని గతంలో అల్లు అరవింద్ అనటం జరిగింది.

దాంతో ఇప్పుడు అఖిల్ సినిమా సైతం చిన్న మీడియం రేంజి సినిమా అన్న కలర్ వచ్చేస్తోంది. ఇది అఖిల్ ఫ్యాన్స్ కు ఇంకా మండేలా చేస్తోంది. దాంతో వారు తమ హీరో సినిమాను గీతా ఆర్ట్స్ పైనే చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ అల్లు అరవింద్ పట్టించుకుంటారా...