అవెంజర్స్ ఎండ్ గేమ్ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో నటించిన సూపర్ హీరోలంతా రియల్ లైఫ్ లో చాలా స్నేహంగా ఉంటారు. ఒకరిపై మరొకరికి చాలా అభిమానం ఉంది. తాజాగా వీరిమధ్య బంధాన్ని తెలియజేసే మరో సంఘటన చోటు చేసుకుంది.

ఐరన్ మ్యాన్(రాబర్ట్ డౌనీ) తన టీమ్ మెట్ కెప్టెన్ అమెరికా(క్రిస్ ఎవాన్స్)కు కాస్ట్లీ గిఫ్ట్ ఒకటి ఇచ్చారు. 1967 కస్టమైజ్‌డ్ షెవ్రోలే కామేరో కారుని గిఫ్ట్ గా అందించారు. ఈ కారు ఖరీదు రూ.2 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.

ఈ కారు ఇంజిన్ చాలా పవర్ ఫుల్ అట. ఇంజిన్ మాగ్జిమం పవర్ 750 హెచ్ పీ. కారు స్టీరింగ్ పై కెప్టెన్ అమెరికా షీల్డ్ గుర్తు కూడా ఉంది. సెలబ్రిటీలు చాలా మంది తమ సహ నటీనటులకు ఖరీదైన బహుమతులు అందిస్తూ తమ ప్రేమను చాటుతుంటారు.

ఇప్పుడు ఐరన్ మ్యాన్ కూడా తన తోటి యాక్టర్ కి కారు గిఫ్ట్ గా ఇచ్చి తన ప్రేమను తెలియజేశాడు.