బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని అతడే సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. 15 రోజులు కిందటే తనకు ఈ విషయం తెలిసిందని, అప్పటి నుంచీ తాను తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు అతనే చెప్పాడు. అయితే ఆ వ్యాధి వివరాలు మాత్రం చెప్పలేదు. మరో వారం, పది రోజుల్లో ఆ వ్యాధి గురించిన వివరాలు చెబుతానని, అంతవరకు అభిమానులు ఎలాంటి పుకార్లను నమ్మొద్దని ఇర్ఫాన్ స్పష్టంచేశాడు. కొన్నిసార్లు జీవితం తలకిందులైనట్లు అనిపిస్తుంది.

 

గత 15 రోజులుగా నేను అదే అనుభవిస్తున్నాను. అరుదైన కథలను ఎంచుకొని నటించిన నాకు.. ఇలా అరుదైన వ్యాధి సోకుతుందని ఊహించలేదు అయినా అధైర్య పడను పోరాడుతూనే ఉంటాను అని ఇర్ఫాన్ ఓ ట్వీట్‌లో చెప్పాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ కష్టకాలంలో తన వెన్నంటే ఉన్నారని అతను తెలిపాడు. ఈ మధ్యే దీపికా, ఇర్ఫాన్‌లతో విశాల్ భరద్వాజ్ రాణి అనే ఓ మూవీ ప్లాన్ చేసినా.. దానిని వాయిదా వేస్తున్న‌ట్లు ప్రకటించాడు. ఇర్ఫాన్‌కు జాండిస్ వచ్చినందుకు మూవీని పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు విశాల్ భరద్వాజ్ అప్పుడు చెప్పాడు.