Asianet News TeluguAsianet News Telugu

`జవాన్‌` సినిమా చూసిన రింకూ సింగ్‌.. షారూఖ్‌ రియాక్షన్ ఏంటంటే?

ఐపీఎల్‌ సునామీ రింకూ సింగ్‌ `జవాన్‌` చిత్రాన్ని వీక్షించారు. షారూఖ్‌కి రింకూ పెద్ద అభిమాని. ఈ నేపథ్యంలో `జవాన్‌` సినిమా చూసి షారూఖ్‌పై తన ప్రేమ, అభిమానాన్ని చాటుకున్నారు. 

ipl sensation rinku singh watched jawan movie what shahrukh khan  reaction arj
Author
First Published Sep 11, 2023, 10:05 AM IST

బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారూఖ్‌ ఖాన్‌.. హీరోగా నటించిన `జవాన్‌` చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే ఐదు వందల కోట్లు దాటేసింది. బాలీవుడ్‌లో సరికొత్త రికార్డుల దిశగా వెళ్తుంది. సినిమాకి ఆడియెన్స్ నుంచే కాదు, సెలబ్రిటీల నుంచి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమా అదిరిపోయిందంటున్నారు. సినిమా వాళ్లే కాదు, క్రికెటర్లు కూడా ఈ సినిమాని ఆస్వాదిస్తున్నారు. ఎంజాయ్‌ చేస్తున్నారు. షారూఖ్‌పై ఫ్యాన్‌ బాయ్‌ మూమెంట్లని వ్యక్తం చేస్తున్నారు. 

తాజాగా ఐపీఎల్‌ సునామీ రింకూ సింగ్‌ `జవాన్‌` చిత్రాన్ని వీక్షించారు. షారూఖ్‌కి రింకూ పెద్ద అభిమాని. ఈ నేపథ్యంలో `జవాన్‌` సినిమా చూసి షారూఖ్‌పై తన ప్రేమ, అభిమానాన్ని చాటుకున్నారు. సినిమా పోస్టర్‌ వద్ద నిల్చొని దిగిన ఫోటోని ట్వీట్‌ చేస్తూ, నా ఫేవరేట్‌ హీరో షారూఖ్‌ ఖాన్‌ని ఇప్పుడే చూశాను. లవ్‌ యూ సర్‌` అని పోస్ట్ చేశాడు. దీనికి షారూఖ్‌ కూడా స్పందించారు. `సినిమా నీకు నచ్చిందని అనుకుంటున్న మై మ్యాన్‌. లవ్యూ` అంటూ ప్రతిస్పందించారు. ప్రస్తుతం వీరి పోస్టులు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

ఆయన షారూఖ్‌కి పెద్ద అభిమాని. అంతేకాదు షారూఖ్‌ టీమ్‌ కోల్‌కత్తా నైట్‌ రైడర్‌ టీమ్‌ సభ్యుడు. ఇటీవల ఐపీఎల్‌లో వరుసగా ఐదు సిక్స్ లు కొట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. దీంతో ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లు కూడా ఆడే అవకాశాలు దక్కించుకుంటున్నారు. క్రేజీ స్టార్‌ క్రికెటర్‌గా నిలుస్తుంది. ఇతని ఆటకి షారూఖ్‌ కూడా ఫిదా అయ్యాడు. తన టీమ్‌కి అద్బుతమైన విజయాన్ని అందించిందినందుకు ఆయన చాలా హ్యాపీగా ఫీలయ్యారు. 

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో కేకేఆర్ విజయానికి 29 పరుగులు కావాల్సిన సమయంలో రింకూ.. వరుసగా 5 సిక్సర్లు బాది, అద్వితీయ ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరి ఓవర్ వరకూ మ్యాచ్ గెలిచేసినట్టుగా కూల్‌గా ఉన్న గుజరాత్ టైటాన్స్ టీమ్, రింకూ సింగ్ వరుస సిక్స్ లతో పెద్ద షాక్‌ ఇచ్చాడు. దీనికి గుజరాత్‌ టీమ్‌ మాత్రమే కాదు, కేకేఆర్‌ టీమ్‌ సైతం ఆశ్చర్యపోయింది. రింకూ దెబ్బకి మ్యాచ్‌ తలకిందులయ్యింది. దీంతో ఒక్కసారిగా స్టార్‌ అయిపోయాడు రింకూ సింగ్‌. నేషనల్‌ సెన్సేషన్‌గా మారడం విశేషం. 

ఇక షారూఖ్‌ ఖాన్‌ ఈ ఏడాది జనవరిలో `పఠాన్‌` సినిమాలో దుమ్మురేపారు. ఈ చిత్రం దాదాపు వెయ్యి కోట్ల గ్రాస్‌ చేసిందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఎనిమిది నెలల గ్యాప్‌లో మరో సునామీకి సిద్ధమయ్యారు షారూఖ్‌. ఆయన నటించిన `జవాన్‌` బాక్సాఫీసుకి చుక్కలు చూపిస్తుంది. తమిళ దర్శకుడు అట్లీ రూపొందిన `జవాన్‌`లో నయనతార, దీపికా పదుకొనె, విజయ్‌ సేతుపతి ముఖ్య పాత్రలు పోషించారు. అనిరుథ్‌ రవించందర్‌ సంగీతం అందించారు.

ఈ సినిమా గురువారం విడుదలై నాలుగు రోజుల్లో ఐదు వందల కోట్లు దాటింది. మొదటి రోజు 130కోట్లు, రెండో రోజులు 110, మూడు రోజుల 144, నాలుగో రోజు 157 కోట్లకుపైగానే కలెక్షన్లని సాధించింది. నాలుగు రోజుల్లో ఈ చిత్రం రూ.540 కోట్లు చేసిందని తెలుస్తుంది. నేటి నుంచి ఈ చిత్రం హార్డ్ డేస్‌ని ఫేస్‌ చేయనుంది. ఇప్పుడు కూడా మంచి కలెక్షన్లు వచ్చాయంటే సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తుందని చెప్పొచ్చు. 180కోట్ల బిజినెస్‌తో రిలీజ్‌ అయిన ఈ చిత్రం ఇప్పటికే 280కోట్ల షేర్‌ని సాధించింది. వంద కోట్ల లాభాల్లో ఉంది. డిజిటల్‌, శాటిలైట్‌ రైట్స్  పరంగా ఈ సినిమాకి సుమారు రెండు వందల కోట్లు వచ్చినట్టు టాక్‌. 

Follow Us:
Download App:
  • android
  • ios