ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో కమర్షియల్ గా హిట్ కొట్టడమే కాకుండా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకున్నాడు న‌వీన్ పొలిశెట్టి. కామెడీ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీ బాక్సాపీస్ వ‌ద్ద డబ్బులు బాగానే చేసుకుంది. దాంతో నవీన్ చేసే తదుపరి సినిమాపై అంచనాలు పెరిగాయి.  

ఈ యంగ్ హీరో ఇపుడు జాతి ర‌త్నాలు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు. ఈ నేపధ్యంలో న‌వీన్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుదల చేసిన టీజ‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. జోగిపేట్ శ్రీకాంత్ అనే ఖైదీగా క‌నిపిస్తున్నాడు న‌వీన్ పొలిశెట్టి. మీ ఖాకీబ‌ట్ట‌లు, తుపాకీ గుండ్లు మా నోళ్లు నొక్క‌లేవు ఇన్ స్పెక్టర్ అంటూ న‌వీన్ పొలిశెట్టి చెబుతున్న డైలాగ్స్ ఫ‌న్నీగా ఉన్నాయి. మీరూ ఇక్కడ చూడవచ్చు.,

 

అనుదీప్ కేవీ దర్శకత్వంలో ఈ జాతిరత్నాలు అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను మాహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ నిర్మించాడు. ఈ సినిమాలో ప్రియదర్శి, రామకృష్ణ ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా విడుదల కూడా కరోనా కారణంగా నిలిచింది. ఇంకా ఈ సినిమా రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి అయ్యాయని సమాచారం.