అదృష్టానికి ఆమడ దూరంలో ‘బిగ్ బాస్’ సోహెల్.. ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న ‘లక్కీ లక్ష్మణ్’ టీజర్!
టాలెంటెడ్ యాక్టర్, ‘బిగ్ బాస్ తెలుగు’ ఫేమ్ సోహెల్ నటించి తాజా చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’ (Lucky Lakshman). విడుదలకు సిద్ధమవుతోంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ నుంచి బ్యూటీఫుల్ టీజర్ విడుదలైంది.

టాలెంటెడ్ యాక్టర్ సయ్యద్ సోహెల్ (Syed Sohel) నటుడిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పటి నుంచో పరిచయం. 2008లోనే ‘కొత్త బంగారులోకం’ చిత్రంతో వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ గా మెరిసాడు. ఆ పవన్ కళ్యాణ్ నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’, మహేశ్ నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరుమల్లె చెట్టు’సహా తదితర చిత్రాల్లో ఆయా పాత్రల్లో నటించారు. 2013లో ‘మ్యూజిక్ మ్యాజిక్’తో హీరోగా పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి హీరోగానే వరుస చిత్రాల్లోనటిస్తూ వస్తున్నాడు.
సోహెల్ నటించిన తాజా చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం నుంచి ఈరోజు బ్యూటీఫుల్ టీజర్ ను విడుదల చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో దీని టీజర్‌ను నిర్మాత హరిత గోగినేని, దర్శకుడు ఏఆర్ అభి కలిసి విడుదల చేశారు. టీజర్ లో.. ‘సోహెల్ ఒక మధ్యతరగతి యువకుడి పాత్రను పోషించాడు. అతని తండ్రి అతనిని నిరాడంబరంగా పెంచుతాడు. దీంతో జీవితం మొత్తం అదృష్టానికి ఆమడ దూరంలో ఉన్నట్టుగా ఉంటుంది. కేవలం 'చెడ్డీ' దోస్తులు చరణ్, కిరణ్ మాత్రమే తోడుగా ఉంటారు. గర్ల్ ఫ్రెండ్స్ కూడా దూరమవుతారు.’. లక్కీ లక్ష్మణ్ అనే పేరు పెట్టుకున్నాక జీవితంలో అదృష్టం లేక ఎలాంటి తిప్పలు పడ్డాడో అన్నది సినిమాలో చూడాలి. టీజర్ ఫన్ ఫుల్ గా ఉంది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది.
పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో నిర్మించిన ఈ చిత్రంలో సిట్యుయేషనల్ కామెడీ ఉంది. ఎమోషన్ కూడా కనిపిస్తోంది. ప్రధాన పాత్రలో సోహెల్ నటించగా.. హీరోయిన్ గా మోక్ష (Mokksha) నటిస్తోంది. దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ఎఆర్ అభి దర్శకత్వంలో హరిత గోగినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 30న సినిమా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. మరోవైపు సోహెల్ మిస్టర్ ప్రెగ్నెంట్.. ఆర్గానిక్ మామా హైబ్రిడ్ అల్లుడు, బూట్ కట్ బాల్రాజు లాంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.