అల్లరి నరేష్‌ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ చిత్రాలు హిలేరియస్‌ కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్‌ చేశాయి. అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి భారీ చిత్రాలను అందించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు సమర్పణలో నిర్మిస్తున్న హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం'. ఈ చిత్రం ఆడియోను ఆన్‌లైన్‌లో విడుదలైంది. అన్ని కార్యక్రమాలు పూర్తి ఈ చిత్రాన్ని నవంబర్‌ 12న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేయాలని కూడా ప్లాన్ చేశారు. కానీ కరెన్సీ నోట్ల దెబ్బ ఈ మూవీని కూడా వదల్లేదు. సర్కార్ నిర్ణయంతో ఈ మూవీ విడుదల వాయిదా వేశారు.
ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ ''అల్లరి నరేష్, నాగేశ్వరరెడ్డి కాంబినేషన్లో రూపొందుతున్న హార్రర్ ఎంటర్టైనర్ ఇది. ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్ చేసే విధంగా ఈ చిత్రాన్ని నాగేశ్వరరెడ్డి రూపొందించారు. డెఫినెట్గా అందరికీ నచ్చే సినిమా ఇది. ఈ చిత్రం ఆడియోను ఈరోజు సాయంత్రం ఆన్లైన్లో విడుదల చేస్తున్నాం. ఆల్రెడీ విడుదలైన 'శతమానం భవతి...' పాటకు అన్ని చోట్ల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. సాయికార్తీక్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని నవంబర్ 12న వరల్డ్వైడ్గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.. అంతా సిద్ధం అనుకున్న టైమ్ లో కేంద్రం కరెన్సీ నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించడంతో ఈ మూవీని వాయిదా వేయక తప్పలేదు.
నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ.. ''నవంబర్ 12న విడుదల కావాల్సిన మా 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' చిత్రాన్ని ప్రస్తుతం నెలకొని వున్న పరిస్థితుల దృష్ట్యా విడుదలను వాయిదా వేయడం జరిగింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం'' అన్నారు.
అల్లరి నరేష్, రాజేంద్రప్రసాద్, కృతిక, మౌర్యాని, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, చలపతిరావు, కాదంబరి కిరణ్, ధన్రాజ్, ప్రగతి, రజిత, అమిత్, టార్జాన్, జయవాణి, అపూర్వ, ఆజాద్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, మాటలు: డైమండ్ రత్నబాబు, పాటలు: భాస్కరభట్ల, డాన్స్: రాజుసుందరం, గణేష్, దినేష్, ఫైట్స్: సుంకర రామ్, ఆర్ట్: నారాయణరెడ్డి, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.
