సూపర్ స్టార్ మహేష్, మెగాస్టార్ చిరంజీవి సైతం వైద్య సిబ్బందిలో కీలక భాగమైన నర్సులను వారి సేవలను గుర్తుచేసుకున్నారు. వారి సేవా గుణం గొప్పది అంటూ ట్వీట్ చేయడం జరిగింది. 

నేడు అంతర్జాతీయ నర్స్ డే పురస్కరించుకొని పలువురు ప్రముఖులు వైద్య సిబ్బంది సేవలను కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సూపర్ స్టార్ మహేష్, మెగాస్టార్ చిరంజీవి సైతం వైద్య సిబ్బందిలో కీలక భాగమైన నర్సులను వారి సేవలను గుర్తుచేసుకున్నారు. వారి సేవా గుణం గొప్పది అంటూ ట్వీట్ చేయడం జరిగింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred


కరోనా వైరస్ వ్యాప్తి తరువాత వైద్య సిబ్బంది ప్రాముఖ్యత అవసరం ఎంతగానో పెరిగిపోయింది. ఏడాదికి పైగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నర్సులు కోవిడ్ రోగులకు నిరంతర సేవలు అందిస్తూ, అనేక మంది ప్రాణాలు కాపాడుతున్నారు. తమ వృత్తి నిర్వహణలో కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన నర్సులు అనేకమంది ఉన్నారు. 


వాళ్ళ త్యాగ నిరతిని కీర్తిస్తూ చిరంజీవి, మహేష్ బాబు సోషల్ మీడియాలో సందేశాలు పోస్ట్ చేశారు. మరోవైపు చిరంజీవి ఆచార్య షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ పడింది. సాధారణ పరిస్థితుల నెలకొన్న పక్షంలో మే 13న ఆచార్య విడుదల కావాల్సి ఉంది. 

Scroll to load tweet…


అలాగే మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ ఆగిపోయింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా మహేష్ తన తదుపరి చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ప్రకటించిన విషయం తెలిసిందే. 

Scroll to load tweet…