చిరు,బాబి ప్రాజెక్టుపై ఇంట్రస్టింగ్ అప్డేట్స్

 మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో రానున్న సినిమా మెగా అభిమానులకు ఫుల్‌ ట్రీట్‌ కానుందని నిర్మాతలు నవీన్‌, రవి శంకర్‌ తెలిపారు. చిరంజీవి, బాబీ కాంబోలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై త్వరలో ఓ సినిమా పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. 

Interesting updates of Chiranjeevi-Bobby s project jsp

కరోనా తో బ్రేక్ పడిన 'ఆచార్య' సినిమాను ప్రస్తుతం పూర్తిచేస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత మరో మూడు సినిమాలను వరుసగా చేయనున్నారు. వీటిలో ఒకటి మలయాళ హిట్ సినిమా 'లూసిఫర్' రీమేక్ కాగా.. మరొకటి 'వేదాళం' తమిళ హిట్టుకి రీమేక్. ఇక మూడో చిత్రం బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపొందే సినిమా. ఇది ఏ సినిమాకీ రీమేక్ కాదు. స్ట్రెయిట్ సినిమా. దీనికి సంబంధించిన స్క్రిప్టుకు ఇటీవలే చిరంజీవి ఆమోదముద్ర వేశారని సమాచారం.

అలాగే రీమేక్ ల కంటే ముందుగా బాబీ దర్శకత్వంలో స్ట్రైట్ మూవీ చేయడానికి చిరంజీవి మొగ్గు చూపిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాని కూడా ఖరారు చేసినట్లు సమాచారం.ఇతర క్యాస్టింగ్ కూడా ఫైనల్ అయ్యిందని తెలుస్తుంది.అలాగే ఈ సినిమాకి సంబంధించి మరో అప్డేట్ తాజాగా బయటకొచ్చింది.ఈ చిత్రానికి బాబీ వీరయ్య అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం.

ఇక కథ రీత్యా సినిమాకి కరెక్ట్ గా యాప్ట్ అయ్యే టైటిల్ కావడంతో చిరంజీవి కూడా అదే టైటిల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది.ఇక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథాంశం నడుస్తుంది. కాస్త వయస్సు మళ్ళిన పాత్రలో ఇందులో చిరంజీవి కనిపిస్తాడని టాక్ వినిపిస్తుంది.వచ్చే నెలలో ఈ మూవీని స్టార్ట్ చేయడానికి చిరంజీవి రెడీ అవుతున్నట్లు బోగట్టా. ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. 

‘ఇది పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. మెగాస్టార్‌ నటించిన ‘ఘరానా మొగుడు’, ‘రౌడీ అల్లుడు’, ‘గ్యాంగ్‌లీడర్‌’, ‘ముఠామేస్త్రి’.. ఆ స్టైల్‌లో ఈ సినిమా కథ ఉంటుంది. సినీ ప్రియులకు ఇది ఫుల్ ట్రీట్‌ కానుంది. మేము కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.’ అని వివరించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios