దర్శకుడు శైలేష్ కొలను, నిర్మాత ప్రశాంతి త్రిపురనేని నిర్మిస్తున్న ‘హిట్’సిరీస్ లపై క్రేజీ అప్డేట్ అందింది. హిట్ : ది ఫస్ట్ కేస్ విజయవంతం కావడంతో సీక్వెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ లతో మేకర్స్ పెద్దగానే ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
2020లో విడుదలైన 'హిట్' చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా తెరకెక్కిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ని హీరో నాని సమర్పించారు. ‘హిట్ : ది ఫస్ట్ కేస్’ విజయం సాధించిన నేపథ్యంలో దానికి సీక్వెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. అడివి శేష్ (Adivi Sesh) హీరోగా హిట్ 2 చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సీక్వెల్ ను మేకర్స్ జులై 29న రిలీజ్ చేసేందుకు షెడ్యూల్ చేశారు. ఈ మేరకు మే2న అధికారిక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే అడివి శేష్ నటించిన ‘మేజర్’ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. దీని వెంటనే ‘హిట్ 2’ కూడా రిలీజ్ కు సిద్ధమవుతుండటంతో తప్పకుండా సినిమా విజయవంతం అవుతుందని ఆశిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. సీక్వెల్ హిట్ అయితే.. మున్ముందు మరో ఐదు సిరీస్ లను నిర్మించనున్నారట మేకర్స్. మొత్తం ఏడు సిరీస్ ల లాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు గతంలోనే ప్లాన్ చేశామని తెలిపారు నిర్మాత నాని.
మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా అందింది. మున్ముందు రానున్న హిట్ సిరీస్ లలో ఒక్క దాంట్లో నేచురల్ స్టార్ నాని (Nani) కూడా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రతి సిరీస్ కు కొత్త స్టార్ కాస్ట్ ను పరిచయం చేయాలని భావిస్తున్నారట. దీనిపై నాని స్పందిస్తూ, ఏడు సిరీస్‌లుగా `హిట్` సినిమాని ప్లాన్ చేశాం. ఏడు కథలు లాక్ చేశాం. వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తాం` అని తెలిపారు. మీరు నటించే అవకాశం ఉందా? అని మీడియా అడిగిన ప్రశ్నకి, అవన్నీ సీక్రెట్ అంటూ ఓ నవ్వు నవ్వుతూనే హింట్ ఇచ్చారు నాని.
‘హిట్’కి దర్శకత్వం వహించిన డాక్టర్ శైలేష్ కొలను సీక్వెల్ ని కూడా తెరకెక్కిస్తున్నారు. మిగితా సిరీస్ లకు కూడా దర్శకత్వం వహించనున్నారని సమాచారం. సీక్వెల్ ను వాల్ పోస్టర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాని సమర్పణలో ప్రశాంతి త్రిపురనేని నిర్మిస్తున్నారు. హిట్ 2 సైతం అవుట్ అండ్ అవుట్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరక్కుతుంది. మీనాక్షి చౌదరి అడివి షేక్ కి జంటగా నటిస్తున్నారు.
