తెలుగు బిగ్ బాస్ సీజన్ 3కి రంగం సిద్ధం అవుతోంది. కింగ్ నాగార్జున ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. తొలి రెండు సీజన్ లకు ఎన్టీఆర్, నాని హోస్ట్ గా వ్యవహరించారు. మూడవ సీజన్ ని మరింత వినోదాత్మకంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 3 జులై 21 నుంచి టెలికాస్ట్ చేయడం ప్రారంభిస్తారట. 

బిగ్ బాస్ సీజన్ 3లో కామన్ మ్యాన్స్ ఎవరూ ఉండబోవడం లేదని తెలుస్తోంది. 16 మంది సభ్యులు సెలెబ్రిటీలే ఉంటారట. నాగార్జున లాంటి సీనియర్ హీరో హోస్ట్ గా వ్యవహరించబోతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ విషయంలో పలువురి సెలెబ్రిటీల పేర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

ఇంతవరకు బిగ్ బాస్ నిర్వాహకులు అధికారికంగా ఎవరి పేర్లు ప్రకటించలేదు. గత బిగ్ బాస్ సీజన్ లో చోటుచేసుకున్న వివాదాలు ఈ సీజన్ లో రీపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు.