త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరక్కించే చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు యువతని ఆకట్టుకునే సినిమాలు తీయడంలో త్రివిక్రమ్ దిట్ట. ప్రస్తుతం అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ తెరక్కుతోంది. ఎప్పటిలాగే త్రివిక్రమ్ ఈ చిత్రంలో భారీ తరగణాన్ని దించుతున్నాడు. 

సీనియర్ హీరోయిన్ టబు, యువ హీరో సుశాంత్, నివేతా పేతురాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. తాజాగా సమాచారం మేరకు సుశాంత్ పాత్ర గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. సుశాంత్, బన్నీ ఈ చిత్రంలో బావ బావమరిదిలుగా నటిస్తారట. సుశాంత్ చెల్లిగా పూజా హెగ్డే, అల్లు అర్జున్ చెల్లిగా నివేదా పేతురాజ్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ చిత్రంలో కథ పరంగా బన్నీ, పూజా హెగ్డే వివాహం.. సుశాంత్, నివేతా పేతురాజ్ వివాహం కుండమార్పిడి పద్దతిలో ఒకే వేదికపై జరగనున్నట్లు తెలుస్తోంది. దీనినిబట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో ఆసక్తికర కథాంశంతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు అర్థం అవుతోంది.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.