Asianet News TeluguAsianet News Telugu

గోపీచంద్ ఆ సెంటిమెంట్ వదలరా, శ్రీను వైట్ల తో చేసినా అదే రిపీట్?

గోపీచంద్, శ్రీను వైట్ల కలయికలో మొదటి చిత్రమిది. స్టార్స్ తో  సూపర్ డూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన శ్రీను వైట్ల కొంత విరామం తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. 

Interesting Title For Sreenu Vaitla Gopichand Movie? jsp
Author
First Published Sep 11, 2023, 7:34 AM IST

సినిమావాళ్లకు సెంటిమెంట్స్ ఎక్కువనే విషయం తెలిసిందే. కోట్ల బడ్జెట్ తో చేసే ప్రాజెక్టులు కాబట్టి ప్రతీ విషయంలోనూ జాగ్రత్తలు,నమ్మకాలు, సెంటిమెంట్స్ తమ ప్రమేయం లేకుండా వచ్చేస్తూంటాయి. ముఖ్యంగా తమ కెరీర్ డౌన్ ఫాలో లో ఉన్నప్పుడు సెంటిమెంట్స్ పైనే ఎక్కువ ఆధారపడుతూంటారు. గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ సినిమా లాంచ్ అయ్యింది. ఇద్దరూ బాగా డౌన్ ఫాల్ లో ఉన్నారు. హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. ఈ క్రమంలో తాజా చిత్రంకు ఓ  సెంటిమెంట్ ని గోపీచంద్ సూచన మేరకు ఫాలో అవుతున్నారనే వార్త మీడియాలో వచ్చింది. 

కామెడీ యాక్షన్ చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టి స్టార్ డైరెక్టర్ స్థాయికి  అయ్యారు శ్రీను వైట్ల. అయితే, ఆయన ఫార్ములానే చాలా మంది ఫాలో అవటంతో ఆయన సినిమాలకు ఐడెంటెటీ లేకపోవటం, ఆ స్కీమ్ లు బోర్ కొట్టడంతో  కొన్నేళ్లుగా వరుసగా పరాజయాలను చవిచూస్తున్నారు. దూకుడు  తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఏ చిత్రం కూడా పెద్దగా విజయం సాధించలేదు. దీంతో అమర్ అక్బర్ ఆంటోనీ తర్వాత ఐదేళ్ల గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్లీ ఎంట్రీ ఇచ్చారు శ్రీను వైట్ల. మ్యాచో స్టార్ గోపిచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది.  ఈ చిత్రంలో గోపిచంద్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. గోపిచంద్‍కు ఇది 32వ సినిమాగా ఉంది.చిత్రాలయం స్టూడియో పతాకంపై వేణు దోనెపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు  

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు 'విశ్వం' (Viswam) టైటిల్ పరిశీలనలో ఉందట!   గోపీచంద్ (Gopichand) సినిమా టైటిల్ చివరిలో 'అం' (సున్నా) వస్తే సినిమా హిట్ అనేది  ఆయన  బలంగా నమ్మే సెంటిమెంట్. ఆయన  విలన్ గా నటించిన 'జయం', 'నిజం', 'వర్షం' సినిమాలు కాదు... హీరోగా లాంచ్ అయిన 'యజ్ఞం'తో భారీ విజయాలు సాధించింది. ఆ తర్వాత 'రణం', 'లక్ష్యం', 'లౌక్యం' టైటిల్స్ చివరిలో సున్నా ఉంది. ఇప్పుడు ఆయన కొత్త సినిమాకు కూడా ఆ సెంటిమెంట్ రిపీట్ చేయాలనే ఈ టైటిల్ పెట్టారని   టాక్. 

గోపీచంద్, శ్రీను వైట్ల కలయికలో మొదటి చిత్రమిది. అగ్ర హీరోలతో సూపర్ డూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన శ్రీను వైట్ల కొంత విరామం తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. హీరో గోపీచంద్ 32వ చిత్రమిది (Gopichand 32 Movie).ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ కు ప్రముఖ రచయిత గోపీ మోహన్ స్క్రీన్ ప్లే రాస్తున్నారు. గతంలో శ్రీను వైట్ల తీసిన పలు చిత్రాలకు ఆయన పని చేశారు.చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.  ఈ సినిమాకు కెవి గుహన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios