దర్శకుడిగా అనీల్ రావిపూడి రూపొందించిన నాలుగు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన 'ఎఫ్ 2' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇప్పుడు ఈ డైరెక్టర్ కి మహేష్ బాబుతో సినిమా చేసే ఛాన్స్ వచ్చిందని సమాచారం. ఇంకా సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన రానప్పటికీ అప్పుడే సినిమాకు టైటిల్ కూడా రిజిస్టర్ చేసేశారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇంతకీ ఆ టైటిల్ ఏంటంటే.. 'వాట్సాప్'. ప్రస్తుతం ఉన్న సమాజంలో 'వాట్సాప్'అంటే తెలియని వారుండరు. ఇప్పుడు దాన్నే మహేష్ కోసం టైటిల్ గా మారుస్తున్నాడట అనీల్ రావిపూడి.

ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సివుంది. దిల్ రాజు, అనీల్ రావిపూడి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తారని సమాచారం.