న్యాచురల్ స్టార్ నాని జెర్సీ సినిమాతో ఓ సక్సెస్  అందుకొని మళ్ళీ డిఫరెంట్ సినిమాలతో సక్సెస్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. అయితే ఆడియెన్స్ తన నుంచి కోరుకునే కామెడీ యాంగిల్ ని కూడా ఈ కుర్ర హీరో డిఫరెంట్ గా చూపించనున్నాడట. ప్రస్తుతం విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో గ్యాంగ్ లీడర్ సినిమాతో నాని బిజీగా ఉన్నాడు. 

రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ లుక్ తోనే సినిమా గురించి ఓకే క్లారిటీ ఇచ్చేశారు. డిఫరెంట్ ఎజెస్ కలిగిన మహిళలతో నాని రివెంజ్ ప్లాన్ చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా చెప్పేశారు. అసలు విషయంలోకి వస్తే.. సినిమాలో నాని పాత్రకు సంబందించిన కొన్ని విషయాలు తెలిసాయి. నాని ఈ సినిమాలో క్రైమ్ రైటర్ గా కనిపిస్తాడట. అలాగే అమాయకత్వం చిరాకు కలిగిన స్వభావాలతో ఉంటాడట. 

ఇక గ్యాంగ్ తో కలిసినప్పుడు నాని చేసే పనులు ఎంతగానో నవ్విస్తాయని టాక్. దర్శకుడు విక్రమ్ సినిమాలో సీరియస్ రివెంజ్ ని చూపిస్తూనే నాని పాత్రను కామెడీగా ఎలివేట్ చేస్తాడట. ఈ సినిమాలో న్యాచురల్ స్టార్ క్యారెక్టర్ కెరీర్ లోనే ది బెస్ట్ క్యారెక్టర్ గా నిలుస్తుందని సమాచారం. ప్రస్తుతం సినిమా షూటింగ్ పనులు ఎండింగ్ లో ఉన్నాయి. ఇక ఈ నెల  24వ తేదీన టీజర్ ని రిలీజ్ చేయనున్నారు.