సమంత విడాకులు తీసుకుని వెళ్ళిపోయినా నాగార్జున అలా చేశాడా? ఆసక్తి రేపుతున్న న్యూస్ 


టాలీవుడ్ పెద్ద కుటుంబాల్లో ఒకటైన అక్కినేని కుటుంబానికి సమంత కోడలిగా వెళ్ళింది. అయితే వీరి కాపురం సవ్యంగా సాగలేదు. దీనికి సంబంధించిన ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. 
 

interesting news about samantha and naga chaitanya ksr

సమంత ఏమాయ చేసావే మూవీతో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది . ఆ చిత్ర హీరో నాగ చైతన్య ప్రేమలో పడింది. ఏళ్ల తరబడి ప్రేమించుకున్న జంట 2018లో వివాహం చేసుకున్నారు. గోవాలో హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో వివాహం జరిగింది. నాలుగేళ్లు బాగానే కాపురం చేశారు ఏమైందో తెలియదు కానీ విడాకులు తీసుకుని విడిపోయారు. 

2021 అక్టోబర్ లో అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. ఇదిలా ఉంటే సమంత నాగ చైతన్యతో విడిపోయినా.. సమంత జ్ఞాపకాలు నాగార్జున ఇంట్లో అలానే ఉన్నాయట. నాగ చైతన్య పెళ్లి ఫోటో నాగార్జున ఇంట్లో అలానే ఉందట. సమంత విడాకులు తీసుకుని ఆ కుటుంబానికి దూరమైనా... పెళ్లి ఫోటో ఎందుకు తొలగించలేదని అనుమానాలు రేగాయి. 

అందుకు ఓ కారణం ఉందట. నాగ చైతన్య పెళ్లి ఫొటోలో కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉన్నారట. ఆ కారణంగానే సమంత-నాగ చైతన్య పెళ్లి ఫోటో ఇంట్లో హాలులో ఉంచారట. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ వైరల్ అవుతుంది. ప్రస్తుతం సమంత సినిమాలకు విరామం తీసుకున్నారు. ఆమె కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటించలేదు. సమంత నెక్స్ట్ సిటాడెల్ వెబ్ సిరీస్లో కనిపించనుంది. ఇది పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. 

సమంత గత ఏడాది శాకుంతలం, ఖుషి చిత్రాల్లో నటించింది. శాకుంతలం డిజాస్టర్ కాగా ఖుషి ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. సమంత నెక్స్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios