సారాంశం
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ఆదిపురుష్ జూన్ 16న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. దీనితో ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఆదిపురుష్ టీం కనీవినీ ఎరుగని విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ఆదిపురుష్ జూన్ 16న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. దీనితో ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఆదిపురుష్ టీం కనీవినీ ఎరుగని విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ప్రీరిలీజ్ వేడుకకు ప్రభాస్, కృతిసనన్, ఓం రౌత్ సహా ఆదిపురుష్ టీం మొత్తం హాజరైంది.
ప్రీరిలీజ్ వేడుకలో చిన్న ఆసక్తికర సంఘటన జరిగింది. శ్రీరాముడు కోదండాన్ని ఉపయోగిస్తారు. అది ఆయన ధనుస్సు. దానిని ఆదిపురుష్ చిత్రంలో ఓం రౌత్ ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఆ ధనుస్సు నమూనాని ప్రీరిలీజ్ వేడుకలో ప్రదర్శించారు.
శ్రీరాముడు సీతా దేవి స్వయంవరంలో ఎవ్వరికి సాధ్యం కానీ శివధనుస్సును అవలీలగా పైకెత్తి ఎక్కుపెట్టడమే కాదు విరిచేస్తారు. ప్రీరిలీజ్ వేడుకలో ఆ తరహాలో ఏర్పాట్లు చేశారు. ప్రభాస్ ఆదిపురుష్ లో వాడిన నమూనా ధనుస్సుని ఎత్తాల్సిందిగా యాంకర్లు నిర్మాతలు భూషణ్ కుమార్, ఇతరులని అడిగారు. కానీ బరువైన ఆ ధనుస్సుని ఎవ్వరూ పైకి లేపలేకపోతారు. ఈ దృశ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రేక్షకులని ఆకట్టుకుంది.