ఫ్రైడే మార్నింగ్ షో పడగానే ఆడియన్స్ రియాక్షన్ తెలుసుకునేందుకు మీడియా థియేటర్స్ వద్ద వాలిపోతుంది. ప్రసాద్స్ లాంటి చోట మార్నింగ్ షో రివ్యూల పేరుతో జరిగే హంగామా అంతా ఇంతా కాదు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో ది అవతార్ చిత్రం శుక్రవారం నుంచి థియేటర్స్ లో సందడి చేస్తోంది. రిలీజ్ రోజున పవన్ ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. థియేటర్లు హోరెత్తేలా ఫస్ట్ డే ఫస్ట్ షోలలో రచ్చ చేశారు. సముద్రఖని దర్శకత్వంలో.. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనలో ఈ చిత్రం తెరకెక్కింది. 

అయితే క్రిటిక్స్ నుంచి, ప్రేక్షకుల నుంచి బ్రో చిత్రానికి కొంత మిక్స్డ్ టాక్ వస్తోంది. ఏదిఏమైనా బ్రో చిత్రం తొలిరోజు సాలిడ్ కలెక్షన్స్ సాధించింది. ఏకంగా 48 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే బ్రో ప్రదర్శించబడుతున్న ఓ థియేటర్ వద్ద ఆసక్తికర సంఘటన జరిగింది. ఫ్రైడే మార్నింగ్ షో పడగానే ఆడియన్స్ రియాక్షన్ తెలుసుకునేందుకు మీడియా థియేటర్స్ వద్ద వాలిపోతుంది. 

ప్రసాద్స్ లాంటి చోట మార్నింగ్ షో రివ్యూల పేరుతో జరిగే హంగామా అంతా ఇంతా కాదు. ఆడియన్స్ ఎగ్జైట్ మెంట్ ని క్యాష్ చేసుకునేలా కొందరు మీడియా ప్రతినిధులు వ్యవహరిస్తుంటారు. సినిమా ఎలా ఉంది అని హైప్ పెంచే ప్రయత్నమో లేక అది మైనస్ ఇది మైనస్ అని నెగిటివ్ పబ్లిసిటీ ఇచ్చే ప్రయత్నమో చేస్తుంటారు. కొందరు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు తమ వ్యూస్ పెంచుకునేందుకు రివ్యూలు, పబ్లిక్ టాక్ అంటూ థియేటర్స్ వద్ద మైక్స్. కెమెరాలతో వాలిపోతారు. 

Scroll to load tweet…

ప్రేక్షకులు సినిమా బావుందని చెబితే అంతటితో ఆగరు. ఏం బావుంది.. అని ఆరా తీస్తారు. బాగాలేదు అని చెబితే మైనస్ లు ఏంటి అని లోతుగా ప్రశ్నిస్తారు. దీనిపై ఓ సినీ అభిమాని బ్రో థియేటర్ వద్ద కెమెరామెన్ కి గట్టిగా క్లాస్ ఇచ్చాడు. సదరు కెమెరా మెన్ బ్రో చిత్రంలో లాగ్ ఉందా అంటూ తనకు కావలసిన ఆన్సర్ ని ఆడియన్స్ నుంచి రాబట్టే ప్రయత్నం చేశాడు. దీనితో ఆ అభిమాని కలగజేసుకుని సినిమా ఎలా ఉందని అడుగు అంతేకాని పక్కన నిలబడి లాగ్ ఉందా, అట్లా ఉందా అని సజెషన్స్ ఇవ్వకు అంటూ మండిపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.