Asianet News TeluguAsianet News Telugu

బయ్యర్లకి పవన్ కళ్యాణ్ సినిమా స్పెషల్ షో వేస్తే.. అందరూ పడుకున్నారు, కానీ మూవీ సంచలన విజయం

అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రంతో పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయం అయ్యారు. బిగినింగ్ లో రెండు మూడు చిత్రాలు పర్వాలేదనిపించాయి. కానీ పవన్ కళ్యాణ్ కి తనకంటూ ప్రత్యేక గుర్తింపు రాలేదు. 

Interesting facts about pawan kalyan tholi prema movie dtr
Author
First Published Aug 21, 2024, 6:44 PM IST | Last Updated Aug 21, 2024, 6:44 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రంతో పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయం అయ్యారు. బిగినింగ్ లో రెండు మూడు చిత్రాలు పర్వాలేదనిపించాయి. కానీ పవన్ కళ్యాణ్ కి తనకంటూ ప్రత్యేక గుర్తింపు రాలేదు. 

పవన్ కళ్యాణ్ తన మార్క్ మ్యానరిజమ్స్ ప్రదర్శిస్తూ యువతలో ఫాలోయింగ్ పెంచుకోవడం మొదలు పెట్టిన చిత్రం తొలిప్రేమ. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ప్రేమ కథగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో యువతని ఉర్రూతలూగించింది. 

ఈ చిత్రానికి మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా పనిచేశారు. టాలీవుడ్ ది బెస్ట్ ఎడిటర్స్ లో మార్తాండ్ కె వెంకటేష్ ఒకరు. తొలిప్రేమ చిత్రానికి గాను ఆయన నంది అవార్డు అందుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో తొలిప్రేమ చిత్రం గురించి చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

తొలిప్రేమ చిత్రం ఎడిట్ చేస్తున్నప్పుడు మా అందరికి చాలా బాగా నచ్చింది. అప్పట్లో రిలీజ్ కి ముందు ఈ చిత్రాన్ని బయ్యర్లకి స్పెషల్ షో వేశాం. ఒక్కరికి కూడా తొలిప్రేమ నచ్చలేదు. అంతా పడుకుని నిద్రపోయారు. కానీ ఆడియన్స్ కి ఆ చిత్రం ఎంత బాగా నచ్చిందో చూడండి అని అన్నారు. సంచలన విజయం గా నిలిచింది. 

స్పెషల్ షో చూశాక ఒక బయ్యర్ నాతో.. మీ డైరెక్టర్ కి ఆడోళ్ళంటే ఇష్టం లేదా.. ఫిమేల్ వాయిస్ తో ఒక్క పాట కూడా లేదేంటి అని అన్నారు. కానీ మేము ఆ విమర్శలు పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఆ చిత్రంలో బాయ్ నెక్స్ట్ డోర్ అన్నట్లుగా ఉంటుంది అని తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios