మరికొన్ని గంటల్లో ఆస్కార్ అవార్డుల వేడుకకి తెర లేపనున్నారు. ఆదివారం రోజు సాయంత్రం లాస్ ఏంజిల్స్ లో అకాడమీ అవార్డుల వేడుక వైభవంగా జరగనుంది. ఎప్పుడూ భారతీయులకు ఆస్కార్ అవార్డుల వేడుక పట్ల అంత ఆసక్తి ఉండేది కాదు.
మరికొన్ని గంటల్లో ఆస్కార్ అవార్డుల వేడుకకి తెర లేపనున్నారు. ఆదివారం రోజు సాయంత్రం లాస్ ఏంజిల్స్ లో అకాడమీ అవార్డుల వేడుక వైభవంగా జరగనుంది. ఎప్పుడూ భారతీయులకు ఆస్కార్ అవార్డుల వేడుక పట్ల అంత ఆసక్తి ఉండేది కాదు. కానీ ఈసారి ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఫైనల్ నామినేషన్స్ లో ఉంది. ఆర్ఆర్ఆర్ టీం ఆస్కార్ అవార్డుని ముద్దాడేందుకు ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డు గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపుతున్నారు. ఆస్కార్ అవార్డు దేనితో తయారు చేస్తారు ? దాని విలువ ఎంత ఉంటుంది ? అనే ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి.
ఆస్కార్ అవార్డు చూడడానికి గోల్డ్ కలర్ లో ఉంటుంది. కానీ పూర్తిగా అది బంగారం కాదు. ఆస్కార్ అవార్డుని కాపర్ తో తయారు చేస్తారు. ఆ తర్వాత బంగారు పూత పూస్తారు. ఆస్కార్ అవార్డు 13.5 అంగుళాల పొడవు ఉంటుంది. మూడున్నర కేజీలపైనే బరువు ఉంటుంది. ఒక ఆస్కార్ అవార్డు తయారికి దాదాపు 400 డాలర్ల వరకు ఖర్చు అవుతుందట. అంటే మన కరెన్సీలో రూ30 వేలు పైనే.

ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుని గెలుచుకుని దానిని అమ్మితే కోట్ల వర్షం కురుస్తుంది కదా అనే అపోహ అభిమానుల్లో ఉంది. ఆస్కార్ అవార్డుని అమ్మితే అంతకంటే పిచ్చోళ్ళు ఉండరనే చెప్పాలి. ఎందుకంటే ఆస్కార్ అవార్డుని అమ్మితే వచ్చేది కేవలం ఒక్క డాలర్ మాత్రమే. అదేంటి అనుకుంటున్నారా.. అదే అకాడమీ సంస్థ పెట్టిన దిమ్మతిరిగే రూల్.
1950లో అమెరికన్ డైరెక్టర్ తాను గెలుచుకున్న ఆస్కార్ అవార్డుని వేలం వేయగా ఏకంగా ఆరున్నర కోట్ల ధర పలికింది. అకాడమీ సంస్థ ఆగ్రహంతో కొత్త రూల్ తీసుకువచ్చింది. అకాడమీ అవార్డుని అమ్మాలన్నా కొనాలన్నా ఆ హక్కు అకాడమీ సంస్థకి మాత్రమే ఉండేలా నిబంధన తీసుకువచ్చారు. అది కూడా ఆస్కార్ అవార్డు ధర 1 డాలర్ కి మించకుండా విక్రయించాలి అని నిబంధన తెచ్చారు. అందుకే ఆస్కార్ అవార్డు దాచుకునే మధురమైన అనుభూతి మాత్రమే.
