పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు డాలి( కిషోర్ కుమార్ పార్థసాని) కాంబినేషన్ లో కాటమరాయుడు చిత్రం తెరకెక్కింది. 2017లో విడుదలైన ఈ చిత్రం నిరాశపరిచింది. కానీ పవన్ సరికొత్తగా పంచె కట్టు లుక్ లో అలరించాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. తమిళంలో సూపర్ హిట్ అయిన అజిత్ చిత్రం 'వీరం'కు ఇది రీమేక్. 

వీరం చిత్రాన్ని త్వరలో బాలీవుడ్ లో కూడా రీమేక్ చేయనున్నారు.  బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సాజిద్ నదియావాలా ఈ చిత్రాన్ని ల్యాండ్ ఆఫ్ లుంగీ పేరుతో రీమేక్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. అనుకోని విధంగా యంగ్ హీరోకు ఈ చిత్రంలో నటించే ఛాన్స్ దక్కింది. యురి ది సర్జికల్ స్ట్రైక్ చిత్రంతో విక్కీ కౌశల్ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. ఆర్మీ మేజర్ గా ఆ చిత్రంలో విక్కీ కౌశల్ నటన ఆకట్టుకుంది. 

వీరం చిత్ర రీమేక్ లో విక్కీ కౌశల్ హీరోగా ఎంపికయ్యాడు. ముందుగా ఈ చిత్రం కోసం దర్శకుడు సాజిద్ అక్షయ్ కుమార్ ని అనుకున్నారు. కానీ అక్షయ్ కుమార్ సూర్యవంశీ, మిషన్ మంగళ్, లక్ష్మి బాంబ్ లాంటి చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ నుంచి అక్షయ్ తప్పుకోవడం విక్కీ కౌశల్ కు కలసివచ్చింది.