వరుణ్ తేజ్, లావణ్య రిసెప్షన్ జరిగే వేదిక యజమాని ఎవరో తెలుసా.. ఆ బడా హీరోనేనా..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరికొన్ని రోజుల్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రేయసి లావణ్య త్రిపాఠిని నవంబర్ 1న వరుణ్ తేజ్ ఇటలీలో వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరికొన్ని రోజుల్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రేయసి లావణ్య త్రిపాఠిని నవంబర్ 1న వరుణ్ తేజ్ ఇటలీలో వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. దీనితో మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి సందడి నెలకొంది.
మిస్టర్ చిత్ర షూటింగ్ సమయంలో వరుణ్ తేజ్, లావణ్య మొదట కలుసుకుంది ఇటలీలోనే. అందుకే సెంటిమెంట్ గా మ్యారేజ్ వెన్యూని కూడా అక్కడే సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పటికే బ్యాచిలర్ పార్టీలు పూర్తయ్యాయి. ఇక వరుణ్.. లావణ్య మెడలో మూడు ముళ్ళు వేయడమే మిగిలి ఉంది.
మెగా ఫ్యామిలీ మొత్తం ముందు రోజుల ముందే ఇటలీ చేరిపోయారు. అక్టోబర్ 30 నుంచే కాక్ టెల్ పార్టీతో పెళ్లి సంబరాలు మొదలు కానున్నాయి. అక్టోబర్ 31న హల్దీ మెహందీ వేడుకలు జరగనున్నాయి. దీనితో వరుణ్ తేజ్, లావణ్య కుటుంబాలతో పాటు పవన్ కళ్యాణ్, చిరంజీవి, రాంచరణ్ మెగా ఫ్యామిలీ మొత్తం సతీసమేతంగా ఇటలీలో వాలిపోయారు.
ఇదిలా ఉండగా నవంబర్ 5న హైదరాబాద్ మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో వరుణ్, లావణ్య రిసెప్షన్ వేడుక జరగనుంది. ఈ రిసెప్షన్ కి తెలుగు రాష్ట్రాల నుంచి 3 వేల మంది వరకు అతిథుల్ని ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. ఎంతో ఘనంగా రిసెప్షన్ వేడుక జరుగనుంది.
లగ్జరీ వేడుకలు జరిగే ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ కి యజమాని ఓ బడా హీరో కాబట్టి. దీనికి యజమాని ఎవరో కాదు స్టార్ హీరో అక్కినేని నాగార్జున అని అంటున్నారు. ప్రముఖ వ్యాపార వేత్త నల్లా ప్రీతం రెడ్డితో కలసి భాగస్వామ్యంతో నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కి యజమానిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.