స్టార్ డైరక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా చిత్రం అక్టోబర్ 2న విడుదలకు సిద్ధం అవుతోంది. చరిత్ర మరచిన తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

ఉయ్యాలవాడ వీరత్వాన్ని ప్రతిబింబించేలా సైరా చిత్రం ఉండబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా సైరా చిత్ర అడ్వాన్స్ బుకింగ్స్ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఓపెన్ అవుతున్నాయి. 

బెంగుళూరు, పంజాబ్ లోని ఫగ్వారా అనే ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా కొన్ని నిమిషాల్లోనే టికెట్లు మొత్తం అయిపోయాయి. తాజాగా చెన్నైకి సమీపంలోని తిరుపూరుర్ అనే పట్టణంలోకూడా సైరా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. విడుదల రోజు తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రదర్శించే స్పెషల్ షోకి సంబంధించిన టికెట్లన్నీ అయిపోయాయి. ఆ ప్రాంతంలో హిందుస్థాన్ యూనివర్సిటీ ఉంది. అందులో మెగా అభిమానులు అధికసంఖ్యలో ఉన్నారు. టికెట్లు అన్ని అయిపోవడానికి ఇదే కారణం అని తెలుస్తోంది. 

దేశంలో సైరా చిత్ర అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కడ ఓపెన్ చేసినా ఇట్టే అయిపోతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉండబోతోందో ఊహించుకోవచ్చు.