మాస్ చిత్రాల దర్శకుడు సంపంత్ నంది దర్శకత్వంలో తేజు నటించబోతున్నాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. 

గత ఏడాది వినాయక చవితి రోజున సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. బైక్ నుంచి పడడంతో తేజు గాయాలపాలయ్యాడు. 35 రోజులపాటు సాయి ధరమ్ తేజ్ కు అపోలో వైద్యులు చికిత్స అందించారు. అనంతరం తేజు పూర్తిగా కోలుకున్నాడు. ప్రస్తుతం తేజు వరుస చిత్రాల్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. 

ఆల్రెడీ కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ చిత్రానికి ప్రకటన వచ్చింది. ఇప్పుడు తేజు మరో క్రేజీ చిత్రానికి రెడీ అవుతున్నాడు. మాస్ చిత్రాల దర్శకుడు సంపంత్ నంది దర్శకత్వంలో తేజు నటించబోతున్నాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. 

మంచి రోజు చూసుకుని లాంచ్ చేయడమే తరువాయి. సాయి ధరమ్ తేజ్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని సంపత్ నంది అద్భుతమైన కమర్షియల్ కథని సిద్ధం చేశారు. ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ హై ఓల్టేజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తేజు కమర్షియల్ మూవీలో నటించి చాలా రోజులే అవుతోంది. 

చిత్రలహరి క్లాస్ హిట్ గా నిలిచింది. రిపబ్లిక్ మూవీ సందేశాత్మక చిత్రం. సుప్రీం లాంటి సాలిడ్ ఎంటర్ టైనర్ ని ఫ్యాన్స్ తేజు నుంచి ఆశిస్తున్నారు. సంపత్ నంది అలాంటి చిత్రమే తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో తేజు క్యారెక్టర్ డిఫెరెంట్ గా ఉండబోతోందట. మునుపెన్నడూ చూడని తేజుని ఈ చిత్రంలో చూస్తాం అని అంటున్నారు. రాంచరణ్ తో రచ్చ తర్వాత సంపత్ నంది మరో మెగా హీరోతో తెరకెక్కిస్తున్న చిత్రం ఇదే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.